ఏపీలోనూ పన్ను మినహాయించాలి: రాజమౌళి | SS Rajamouli asks AP govt to make 'Rudramadevi' tax free | Sakshi
Sakshi News home page

ఏపీలోనూ పన్ను మినహాయించాలి: రాజమౌళి

Published Thu, Oct 8 2015 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

ఏపీలోనూ పన్ను మినహాయించాలి: రాజమౌళి

ఏపీలోనూ పన్ను మినహాయించాలి: రాజమౌళి

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయించడం పట్ల బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. చరిత్రను తెరకెక్కించడానికి చాలాకాలంగా ఎంతో కష్టపడ్డ గుణశేఖర్ కు ఇది చాలా శుభవార్త అంటూ ట్వీట్ చేశారు.

రుద్రమదేవి మన తెలుగు నేలకే రాణి అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చిత్రంపై పన్ను మినహాయించాలని ఆయన కోరారు. అలాగే 'రుద్రమదేవి' చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు జక్కన్న.  కాగా చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్ తో పాటు, నిర్మాత దిల్ రాజు గురువారం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో 'రుద్రమదేవి' చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చినందుకు ఈ సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. రుద్రమదేవి సినిమా శుక్రవారమే విడుదల అవుతోందని, మొట్టమొదటి రియల్ 3డిలో తీసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement