
ప్రముఖ అమెరికన్ కామిక్ రచయిత, స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్లీ (95) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూయార్క్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ‘స్పైడర్ మ్యాన్, ఎక్స్–మెన్, థోర్, ఐరన్‌మ్యాన్, బ్లాక్‌పాంథర్, ద ఫెంటాస్టిక్ ఫోర్, అవెంజర్స్’, డాక్టర్ స్ట్రేంజ్’, డేర్ డెవిల్’, ‘హల్క్’.. లాంటి సూపర్ హీరో పాత్రలు ఆయన సృష్టించినవే. 1922 డిసెంబర్ 28న జన్మించిన స్టాన్లీ 1961లో మార్వెల్ కామిక్స్‌లో చేరారు. 1961లో తొలిసారి ‘ద ఫెంటాస్టిక్ ఫోర్’ పేరుతో క్యారెక్టర్లను సృష్టించిన ఆయన ఆ తర్వాత ఎన్నో సూపర్ హీరో పాత్రలకు ప్రాణం పోశారు.
హాలీవుడ్‌లో ‘ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్’గా గుర్తింపు తెచ్చుకున్న స్టాన్లీ రచయిత, ఎడిటర్, పబ్లిషర్‌గా కూడా కొనసాగారు. ఆయన ఇక లేరనే వార్త కామిక్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘మార్వెల్ కామిక్ పుస్తకాన్ని తెరిచినప్పుడల్లా స్టాన్లీనే గుర్తొస్తారు’ అని మార్వెల్ సంస్థ వెల్లడించింది. ఆయన మృతికి హాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు భారతీయ సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment