మహేశ్ పుట్టిన రోజు భలే మంచి రోజు | Sudheer Babu's 'Bhale Manchi Roju' First Look | Sakshi
Sakshi News home page

మహేశ్ పుట్టిన రోజు భలే మంచి రోజు

Published Sat, Aug 8 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

మహేశ్ పుట్టిన రోజు భలే మంచి రోజు

మహేశ్ పుట్టిన రోజు భలే మంచి రోజు

ఈరోజు మహేశ్ బాబు పుట్టినరోజు. అభిమానులందరూ ‘మంచి రోజు’గా భావిస్తారు. అందుకే, ఈ రోజు కోసం ఏదైనా స్పెషల్స్ ప్లాన్ చేస్తారు. ‘70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ కూడా సమ్‌థింగ్ స్పెషల్ ప్లాన్ చేసింది. సుధీర్‌బాబు, వామిక జంటగా తొలి ప్రయత్నంగా ఈ సంస్థపై ‘భలే మంచి రోజు’ పేరుతో విజయ్, శశి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు అంటే అభిమానులందరికీ మంచి రోజు కాబట్టి, ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని ఈరోజు విడుదల చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన విజయ్ తెలిపారు. విశేషం ఏంటంటే... ఒకే ఒక్క రోజులో జరిగే సంఘటనల సమాహారంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 
  ఈ చిత్రకథ, ఇతర విశేషాలను విజయ్ తెలియజేస్తూ - ‘‘సుధీర్‌బాబుది ఓ కామన్ మ్యాన్ క్యారెక్టర్. ఈ పాత్ర ఒకరోజులో ఎంతోమందిని కలుస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలేంటి? అది సుధీర్‌బాబు పాత్రకు, ఆయన కలిసిన ఇతర పాత్రలకు ఎందుకు మంచి రోజు అవుతుంది? అనేది ఈ చిత్రకథ. ఇది క్రైమ్, కామెడీ మూవీ. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో రెండు పాటలు మినహా చిత్రం పూర్తయ్యింది. సాంకేతికంగా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది.
 
 కమల్‌హాసన్‌గారు చేసిన ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’ తర్వాత ఇమ్మీడియట్‌గా ఛాయాగ్రాహకుడు శ్యామ్ దత్ చేస్తున్న చిత్రం ఇదే కావడం ఓ విశేషం. కెమెరా ఓ కనువిందు అయితే, ఎం.ఆర్. సన్నీ స్వరపరచిన పాటలు వీనుల విందుగా ఉంటాయి. ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తున్నాం. ‘70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్’ పేరుతో ఉన్న మా ఫేస్‌బుక్ ఐడీలో ఈ చిత్రవిశేషాలను, ఫొటోలను చూడొచ్చు’’ అని తెలిపారు. సాయికుమార్, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణ,  పృథ్వీరాజ్, ప్రవీణ్, ధన్యా బాలకృష్ణ, చైతన్య కృష్ణ, నర్రా శ్రీనివాస్, ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి, శ్రీరామ్, విద్యులేఖ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అర్జున్-కార్తీక్, ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ, ఆర్ట్: ఎస్. రామకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement