Bhale Manchi Roju
-
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
-
మేకింగ్ ఆఫ్ 'భలే మంచి రోజు'
-
'భలే మంచిరోజు' టీంతో చిట్ చాట్
-
జైలులో..భలే మంచి రోజు
హీరో సుధీర్ బాబు, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, హాస్య నటుడు వేణులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోశారు. అయ్యో అంత పని ఏం చేశారు వాళ్లు అనుకుంటున్నారా..? అసలు విషయమేమిటంటే.. అనాథ పిల్లలు న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఎఫ్ఎం రేడియో మిర్చి శనివారం కూకట్‌పల్లిలోని మంజీరా మాల్లో ‘ఫండ్ రైజింగ్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జైలు లాంటి సెట్లో ఆర్జే సమీర్ బందీ అయ్యారు. సదుద్దేశంతో అతను చేసిన ఈ సత్కార్యానికి తమ వంతు సహకారమందించాలని ‘భలే మంచి రోజు’ చిత్ర బృందం భావించింది. అందుకే సుధీర్‌బాబు, శ్రీరామ్ ఆదిత్య, వేణు మంజీరా మాల్‌కు వచ్చారు. జైలు లాంటి ఆ సెట్లో తమను తాము బంధించుకున్నారు. అనాథ పిల్లలకు అవసరమయ్యే ఫండ్ సమకూరే వరకూ బందీలుగానే ఉన్నారు. ‘ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించి, మానవత్వాన్ని చాటుకోవాల’ని సుధీర్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జే హేమంత్, ప్రోగ్రామింగ్ హెడ్ సాయి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణవంశీ తర్వాత నువ్వే అన్నారు!
సినిమా డెరైక్టర్ కావాలనుకుని బంగారంలాంటి జాబ్ వదిలేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. తండ్రి కూడా ఫుల్ సపోర్ట్. దాంతో తాను రాసుకున్న కథతో ఏడాది పాటు ఇండస్ట్రీ అంతా తిరిగాడు. చివరకు ఓ మంచి రోజున విజయ్, శశిధర్‌లను కలిశాడు. కట్ చేస్తే... ‘భలే మంచి రోజు’ సినిమాకు డెరైక్టర్ అయిపోయాడు. సుధీర్‌బాబు హీరోగా రూపొందిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ దర్శకుడి మనోభావాలు... సినిమా చూసి మా అమ్మా, నాన్న ఎగ్జైట్ అయ్యారు. ‘చాలా బాగా తీశావ్‌రా’ అని నాన్న హగ్ చేసుకున్నారు. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు డెరైక్షన్ అంటే ఇష్టం. అందుకే ఫేస్బుక్, గూగూల్లో పని చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నాను. జాబ్ చేస్తూనే ఓ ఎనిమిది షార్ట్ ఫిలింస్ చేశాను. వాటిలో ఒకదానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. చివరకు జాబ్ మానేసి, డెరైక్షన్ ట్రై చేశా. ఒక విభిన్న చిత్రం చేయాలనే ఆలోచనతో ‘భలే మంచి రోజు’ కథ రాసుకున్నాను. ఒక్క రోజులో జరిగే కథ కావడంవల్ల స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉండాలి. ఈ కథ వినగానే సుధీర్‌బాబుతో చేద్దామని విజయ్ అన్నారు. సుధీర్‌బాబు ఈ చిత్రానికి పర్ఫెక్ట్ అనిపించింది. నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసి ఆయన అవకాశం ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. పరుచూరి గోపాలకృష్ణగారైతే ‘కృష్ణవంశీ తర్వాత నటీనటుల నుంచి ఆ స్థాయిలో నటన రాబట్టుకున్నది నువ్వే’ అన్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య పాత్ర అభ్యంతరకరంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర మాట్లాడిన కొన్ని డైలాగ్స్ తీసివేశాం. అందుకే వల్గర్‌గా అనిపిస్తోంది. ఆ డైలాగ్స్ వినిపించి ఉంటే, అలా అనిపించి ఉండేది కాదు. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు ఉన్నాయి. నా తదుపరి చిత్రం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. అందుకని ఏ కథతో సినిమా చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. -
సుధీర్‌కు కంగ్రాట్స్ : మహేష్ బాబు
ఘట్టమనేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బావమరిది సుధీర్ బాబును స్టార్ హీరోగా నిలబడేందుకు బావ మహేష్ బాబు అన్ని రకాలుగా సాయం చేస్తున్నాడు. ఇప్పటికే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాల ఆడియో వేడులకు హాజరవుతున్న సూపర్ స్టార్ వీలైనప్పుడల్లా సుధీర్ సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన 'భలే మంచి రోజు సినిమా' సక్సెస్ కు కూడా తన వంతు సాయం చేశాడు మహేష్. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో ఉన్న రాజకుమారుడు, భలే మంచి రోజు సినిమాకు వస్తున్న రివ్యూల పై స్పందించాడు. ' భలే మంచి రోజు సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి, హైదరాబాద్ తిరిగొచ్చాక సినిమా చూస్తాను. సుధీర్ బాబు తో పాటు భలే మంచి రోజు సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ రెస్పాన్స్ మూవీ కలెక్షన్ల విషయంలో ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి. Hearing good reviews for #BhaleManchiRoju. Will watch once i am back.congrats to @isudheerbabu n the entire team. — Mahesh Babu (@urstrulyMahesh) December 26, 2015 -
పెద్ద దర్శకులు కూడా ఊహించలేకపోయారు!
‘‘ఈ చిత్రకథకు ఎస్టాబ్లిష్డ్ హీరోలు, విలన్లు, కమెడియన్లు అవసరం లేదు. రెగ్యులర్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, కామెడీతో సాగే మంచి కమర్షియల్ మూవీ. సక్సెస్‌పరంగా ఇప్పటివరకూ ఏ సినిమాకీ కలగనంత నమ్మకం ఈ సినిమాతో కలిగింది’’ అని సుధీర్‌బాబు అన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్‌బాబు, వామిక జంటగా విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన ‘భలే మంచి రోజు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మనోభావాలు... ► ఈ చిత్రనిర్మాతలు విజయ్, శశి నా కాలేజ్‌మేట్స్, అలాగే రూమ్మేట్స్ కూడా. కృష్ణగారికి విజయ్ పెద్ద ఫ్యాన్. ఆయన డైలాగ్స్ అప్పజెబుతుండేవాడు. హీరోగా నన్ను బాగా ప్రమోట్ చేయడం కోసమే వాళ్ళు ఈ సినిమా తీశారు. బడ్జెట్ ఎక్కువ పెట్టొద్దన్నప్పటికీ రాజీపడలేదు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నిటిలోకీ ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. ► శ్రీరామ్ ఆదిత్య చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూశాను. కేవలం కుర్చీలు, బల్లలు, ఫ్యాన్స్‌తో తను తీసిన ఓ థ్రిల్లర్ నాకు చాలా నచ్చింది. అందుకే తన దర్శకత్వంలో చేయాలనుకున్నాను. ► ఈ చిత్రకథను ఎంత పెద్ద దర్శకుల దగ్గర చెప్పినా, తర్వాతి సీన్ ఏమిటనేది ఊహించలేకపోయారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగే కథ ఇది. బెంజ్ షోరూమ్‌లో పని చేసే అబ్బాయి పాత్ర నాది. ఇంట్లో నుంచి బయటకెళ్లిన ఆ అబ్బాయి ఎలాంటి వ్యక్తులను కలుస్తాడు? తర్వాత జరిగే పరిణామాలేంటి? అనేది ఆసక్తిగా ఉంటుంది. ► హీరోను కాకముందు నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విజయ్‌తో కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. హీరో ప్రభాస్‌కి వంశీ మంచి స్నేహితుడనే విషయం తెలిసిందే. వంశీ ద్వారా ప్రభాస్‌తో ఈ సినిమా గురించి చెప్పాం. పూర్తి సినిమా చూడలేదు కానీ, ప్రభాస్ దాదాపు చూసినట్లే. మహేశ్‌బాబు ఇంకా చూడలేదు. ‘ఈ సినిమా తర్వాత సుధీర్ స్టార్ హీరో అవుతాడు’ అని మహేశ్ అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నా మీద తనకంత నమ్మకం. ► ప్రస్తుతం హిందీలో ‘భాగీ’ అనే సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. హీరోగా ఇప్పటివరకూ చేయనంత స్ట్రాంగ్ రోల్ అది. చెప్పాలంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌కు ప్రిపేర్ అయినట్లుగా ఈ సినిమా కోసం చాలా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యాను. -
ఆ రోజు భలే మంచి రోజు
‘భలే మంచి రోజు.. పసందైన రోజు.. వసంతాలు పూసే నేటి రోజు’... ఈ పాట వినపడగానే మనకు గుర్తొచ్చే చిత్రం ‘జరిగిన కథ’. సూపర్‌స్టార్ కృష్ణ, జగ్గయ్య, కాంచన నటించిన ఈ చిత్రంలోని పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే! ఇప్పుడా పాట గురించి ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. ఈ సూపర్ హిట్ సాంగ్ టైటిల్ వచ్చేట్లుగా కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు నటించిన చిత్రం ‘భలే మంచి రోజు’. వామిక హీరోయిన్గా నటించారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్యని ద ర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్‌కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇటీవల మహేశ్‌బాబు చేతుల మీదుగా విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆయనతో విడుదలను చేయించడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో సినిమా బిజినెస్‌కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఒక్క రోజులో జరిగే కథనంతో ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో నిర్మించాం. ఆ రోజు ఎందుకు మంచి రోజు అయ్యింది? అనేది ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శామ్‌దత్, సంగీతం: సన్నీ యమ్.ఆర్. -
ఒక్క హిట్ వస్తే మా బావ స్టారే!
‘‘కొన్ని రోజుల ముందు యూట్యూబ్‌లో టీజర్ చూశా. కొత్తగా ఉందనిపించింది. ఇప్పుడు ప్రచార చిత్రం చూశా. బాగా నచ్చింది. ఇవాళ ప్రేక్షకులు కొత్తదనాన్నే కోరుకుంటున్నారు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, వామిక జంటగా 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి రోజు’. సన్నీ ఎం.ఆర్. స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు ఆవిష్కరించి హీరో రానాకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ -‘‘చిత్ర దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. సుధీర్‌ను అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సుధీర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ పర్సన్. ఒక మంచి హిట్ పడితే, స్టార్ అయిపోతాడు. ఈ సినిమాతో ఆ హిట్ వస్తుందని అనుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున ప్రేక్షకులకు ‘భలే మంచి రోజు’ అవుతుంది’’ అని రానా వ్యాఖ్యానించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా చేయడం అనే నా కల ఈ చిత్రంతో తీరింది. నేనీ రోజు ఇక్కడ ఉన్నానంటే కారణం నా తల్లిదండ్రులే. యూనిట్ అందరం ఇష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు. హీరో సుధీర్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో అతిథులుగా రెజీనా, సందీప్ కిషన్, ‘దిల్’ రాజు, లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకర, దేవా కట్టా, శ్యామ్‌దత్ తదితరులు పాల్గొన్నారు. -
‘భలే మంచి రోజు’ ఆడియో వేడుక
-
భలే మంచి రోజు
ఒకే ఒక్క రోజులో కలిసిన వ్యక్తుల ద్వారా ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది? అతను కలిసిన వ్యక్తులకు ఆ రోజు ఎందుకు మంచి రోజు అవుతుంది? దానికి కారణమైన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘భలే మంచి రోజు’. సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్, శశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నవంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహేశ్ పుట్టిన రోజు భలే మంచి రోజు
ఈరోజు మహేశ్ బాబు పుట్టినరోజు. అభిమానులందరూ ‘మంచి రోజు’గా భావిస్తారు. అందుకే, ఈ రోజు కోసం ఏదైనా స్పెషల్స్ ప్లాన్ చేస్తారు. ‘70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ కూడా సమ్‌థింగ్ స్పెషల్ ప్లాన్ చేసింది. సుధీర్‌బాబు, వామిక జంటగా తొలి ప్రయత్నంగా ఈ సంస్థపై ‘భలే మంచి రోజు’ పేరుతో విజయ్, శశి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు అంటే అభిమానులందరికీ మంచి రోజు కాబట్టి, ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని ఈరోజు విడుదల చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన విజయ్ తెలిపారు. విశేషం ఏంటంటే... ఒకే ఒక్క రోజులో జరిగే సంఘటనల సమాహారంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రకథ, ఇతర విశేషాలను విజయ్ తెలియజేస్తూ - ‘‘సుధీర్‌బాబుది ఓ కామన్ మ్యాన్ క్యారెక్టర్. ఈ పాత్ర ఒకరోజులో ఎంతోమందిని కలుస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలేంటి? అది సుధీర్‌బాబు పాత్రకు, ఆయన కలిసిన ఇతర పాత్రలకు ఎందుకు మంచి రోజు అవుతుంది? అనేది ఈ చిత్రకథ. ఇది క్రైమ్, కామెడీ మూవీ. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో రెండు పాటలు మినహా చిత్రం పూర్తయ్యింది. సాంకేతికంగా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. కమల్‌హాసన్‌గారు చేసిన ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం 2’ తర్వాత ఇమ్మీడియట్‌గా ఛాయాగ్రాహకుడు శ్యామ్ దత్ చేస్తున్న చిత్రం ఇదే కావడం ఓ విశేషం. కెమెరా ఓ కనువిందు అయితే, ఎం.ఆర్. సన్నీ స్వరపరచిన పాటలు వీనుల విందుగా ఉంటాయి. ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తున్నాం. ‘70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో ఉన్న మా ఫేస్బుక్ ఐడీలో ఈ చిత్రవిశేషాలను, ఫొటోలను చూడొచ్చు’’ అని తెలిపారు. సాయికుమార్, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణ, పృథ్వీరాజ్, ప్రవీణ్, ధన్యా బాలకృష్ణ, చైతన్య కృష్ణ, నర్రా శ్రీనివాస్, ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మి, శ్రీరామ్, విద్యులేఖ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అర్జున్-కార్తీక్, ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ, ఆర్ట్: ఎస్. రామకృష్ణ.