సుధీర్కు కంగ్రాట్స్ : మహేష్ బాబు | Mahesh babu responce on Bhale manchi roju movie reviews | Sakshi
Sakshi News home page

సుధీర్కు కంగ్రాట్స్ : మహేష్ బాబు

Published Sat, Dec 26 2015 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

సుధీర్కు కంగ్రాట్స్ : మహేష్ బాబు

సుధీర్కు కంగ్రాట్స్ : మహేష్ బాబు

ఘట్టమనేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బావమరిది సుధీర్ బాబును స్టార్ హీరోగా నిలబడేందుకు బావ మహేష్ బాబు అన్ని రకాలుగా సాయం చేస్తున్నాడు. ఇప్పటికే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాల ఆడియో వేడులకు హాజరవుతున్న సూపర్ స్టార్ వీలైనప్పుడల్లా సుధీర్ సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన 'భలే మంచి రోజు సినిమా' సక్సెస్ కు కూడా తన వంతు సాయం చేశాడు మహేష్.

ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో ఉన్న రాజకుమారుడు, భలే మంచి రోజు సినిమాకు వస్తున్న రివ్యూల పై స్పందించాడు. ' భలే మంచి రోజు సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి, హైదరాబాద్ తిరిగొచ్చాక సినిమా చూస్తాను. సుధీర్ బాబు తో పాటు భలే మంచి రోజు సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ రెస్పాన్స్ మూవీ కలెక్షన్ల విషయంలో ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement