మళ్లీ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు
మళ్లీ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు
Published Sun, Apr 17 2016 8:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM
హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్, తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన సుకుమార్ మంచి విజయాన్ని సాధించాడు. అదే జోరులో వచ్చే సంక్రాంతి బరిలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం కథ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు సుక్కు.
నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఇంత వరకు సినిమా మొదలు పెట్టని సుకుమార్, రామ్ చరణ్ హీరోగా ఓ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ చేస్తానంటూ ప్రకటించాడు. తన గత సినిమాల మాదిరిగా ఎలాంటి సైన్స్ పాఠాలు లేకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. చెర్రీ కూడా ఆరెంజ్ సినిమా తరువాత లవ్ స్టోరీలో నటించలేదు. అందుకే సుకుమార్ డైరెక్షన్లో రొమాంటిక్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా పూర్తయిన తరువాత సుకుమార్ డైరెక్షన్లో సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటిన సుకుమార్ వచ్చే ఏడాది కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
Advertisement
Advertisement