రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా సుల్తాన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రెండో వారంలోనూ నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు భారత్తో పాటు ఓవర్సీస్లోనూ రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి.
ఈ సినిమా తొలి 9 రోజుల్లో భారత్లో 320 కోట్ల రూపాయల (గ్రాస్) వసూళ్లు సాధించింది. నెట్ కలెక్షన్లు 229 కోట్ల రూపాయలు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్స్ ట్వీట్ చేశాడు. ఇక విదేశాల్లోనూ కలుపుకొంటే కలెక్షన్లు మరింత పెరుగుతాయి.
ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ ను సుల్తాన్ సినిమాతో సల్మాన్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా తొలి వారంలో 185 కోట్ల వసూళ్లను సాధించగా.. సుల్తాన్ తొలివారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.