నాలుగు రోజుల్లో రూ. 150 కోట్లు వసూలు | Salman Khan Sultan: All the box office records the film broke | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో రూ. 150 కోట్లు వసూలు

Published Sun, Jul 10 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

నాలుగు రోజుల్లో రూ. 150 కోట్లు వసూలు

నాలుగు రోజుల్లో రూ. 150 కోట్లు వసూలు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓపెనింగ్ కలెక్షన్లలో సల్మాన్ గత హిట్ సినిమా రికార్డులను సుల్తాన్ బ్రేక్ చేసింది. బజరంగి భాయ్జాన్, ప్రేమ్ రతన్ దన్ పాయో చిత్రాల రికార్డులను అధిగమించింది.

పాకిస్థాన్లోనూ సుల్తాన్ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. పాకిస్థాన్ సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టడం విశేషం. 15 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన సుల్తాన్ సినిమాలో సల్మాన్ సరసన అనుష్క శర్మ హీరోయిన్గా నటించింది. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారత్ తో పాటు ఓవర్ సీస్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement