పెళ్లి విషయంలో ఈతరం ఆలోచనా ధోరణికి నిలువుటద్దం పట్టే విధంగా చంద్రసిద్దార్థ్ చేస్తున్న సెల్యులాయిడ్ ప్రయత్నం ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’. సుమంత్, పింకీ సావిక జంటగా చెర్రీ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై పూదోట సుధీర్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చంద్రసిద్దార్థ్ మాట్లాడుతూ -‘‘ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఆద్యంతం సరదాగా ఉంటుంది. కీరవాణి సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్’’ అని చెప్పారు.
నిర్మాత పూదోట సుధీర్ కుమార్ మాట్లాడుతూ -‘‘ ‘మధుమాసం’ తర్వాత సుమంత్ - చంద్రసిద్దార్థ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. బ్యాంకాక్‌కు చెందిన స్టార్ హీరోయిన్ పింకీ సావిక ఇందులో నాయికగా చేశారు. సుమంత్, పింకీల రొమాన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెలాఖరున పాటలను, డిసెంబర్ ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చంద్రమౌళి, రాజేంద్ర, ఎడిటింగ్: జి.వి.చంద్రశేఖర, ఆర్ట్: నాగేంద్ర, స్టైలింగ్: సీత కాంచి, కథ-మాటలు: ఎస్.ఎస్.కాంచి.
సుమంత్‌తో బ్యాంకాక్ హీరోయిన్ రొమాన్స్
Published Tue, Nov 19 2013 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement