చూసినంత తేలిక కాదు చేయడం
సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని, బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయారు. ఇప్పుడామె బాలీవుడ్‌లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి. తాను ప్రత్యేక పాత్ర పోషించిన ‘హేట్ స్టోరి 2’ ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు సన్నీ. ‘‘నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగినవే. భారతీయ మూలాలున్న నేను అనుకోకుండా నా పదహారో ఏటనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో తప్పు చేశాను. ఆ తప్పే నా జీవితంలో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పంథొమ్మిదేళ్ల వయసులో పోర్న్ మూవీ ఇండస్ట్రీలో ప్రవేశించాను. మంచిగానో చెడుగానో పేరు ప్రఖ్యాతులు వచ్చేశాయి’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు సన్నీ. మామూలు సినిమాల్లో నటించడం కష్టమా? లేక పోర్న్ సినిమాల్లో చేయడం కష్టమా? అనడిగితే -‘‘మామూలు సినిమాల్లో నటించడం కష్టమేం కాదు.
కాస్త అందం, అభినయ సామర్థ్యం ఉంటే చాలు... మామూలు సినిమాల్లో నటించేయొచ్చు. కానీ పోర్న్ ిసినిమాలు చేయడంలో మాత్రం చాలా ఇబ్బందులుంటాయి. ఇవి చెప్పుకోలేనివి. అసలు అంతమంది ముందు అలా చేయడానికే ధైర్యం కావాలి. ఎంతో మానసిక దృఢత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. చాలామంది పోర్న్ ఫిలిమ్స్‌ని ఇష్టంగా చూస్తారు. కానీ... చూసినంత తేలిక కాదు చేయడం’’ అని సన్ని లియోన్ చెప్పుకొచ్చారు.