romantic films
-
ఇంపాజిబుల్ లవ్‌స్టోరీ
షాహిద్‌కపూర్, కృతీసనన్ జంటగా హిందీలో ఓ రొమాంటిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ జోషి, ఆరాధన షా కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్, దినేష్ విజన్, జ్యోతిదేశ్ పాండే, లక్ష్మణ్ ఉటేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని బాలీవుడ్ సమాచారం. కాగా ఈ సినిమాను తొలుత అక్టోబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమాను డిసెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ, ‘యాన్ ఇంపాజిబుల్ లవ్‌స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. -
విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్
Malavika Mohanan Want To Act Romantic Movie With Vijay Devarakonda: అతితక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో మంచి హిట్స్ సాధించిన విజయ్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్‌లో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది అమ్మాయిలకు క్రష్‌గా మారిన ఈ రౌడీ హీరోతో నటించాలని ఉందని ఓపెన్‌గా చాలా మంది పాపులర్ హీరోయిన్స్ తెలిపారు. ఇటీవల లైగర్ బ్యూటీ అనన్య పాండే.. విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించింది. తాజాగా మరో హీరోయిన్ విజయ్ దేవరకొండతో రొమాంటిక్ తరహాలో సినిమా చేయాలనుంది తన మనసులోని మాట బయటపెట్టింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ 'పెట్టా', విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక ఇటీవల ధనుష్‌తో నటించిన 'మారన్' సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం 'యుధ్ర' అనే హిందీ మూవీలో నటిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో 'ఆస్క్ మాళవిక' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కాసేపు అభిమానులతో ముచ్చటించి పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు 'విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ లేదా రోమ్ కామ్ సినిమా చేయాలనుంది' అని బదులిచ్చింది మాళవిక మోహనన్. చదవండి: విజయ్ దేవరకొండపై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Really want to act in a romantic or rom com movie with Vijay Deverakonda :) https://t.co/jWAN9QSn8e — malavika mohanan (@MalavikaM_) May 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4431454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చూసినంత తేలిక కాదు చేయడం
సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని, బాలీవుడ్లో పాపులర్ అయిపోయారు. ఇప్పుడామె బాలీవుడ్లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి. తాను ప్రత్యేక పాత్ర పోషించిన ‘హేట్ స్టోరి 2’ ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు సన్నీ. ‘‘నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగినవే. భారతీయ మూలాలున్న నేను అనుకోకుండా నా పదహారో ఏటనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో తప్పు చేశాను. ఆ తప్పే నా జీవితంలో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పంథొమ్మిదేళ్ల వయసులో పోర్న్ మూవీ ఇండస్ట్రీలో ప్రవేశించాను. మంచిగానో చెడుగానో పేరు ప్రఖ్యాతులు వచ్చేశాయి’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు సన్నీ. మామూలు సినిమాల్లో నటించడం కష్టమా? లేక పోర్న్ సినిమాల్లో చేయడం కష్టమా? అనడిగితే -‘‘మామూలు సినిమాల్లో నటించడం కష్టమేం కాదు. కాస్త అందం, అభినయ సామర్థ్యం ఉంటే చాలు... మామూలు సినిమాల్లో నటించేయొచ్చు. కానీ పోర్న్ ిసినిమాలు చేయడంలో మాత్రం చాలా ఇబ్బందులుంటాయి. ఇవి చెప్పుకోలేనివి. అసలు అంతమంది ముందు అలా చేయడానికే ధైర్యం కావాలి. ఎంతో మానసిక దృఢత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. చాలామంది పోర్న్ ఫిలిమ్స్‌ని ఇష్టంగా చూస్తారు. కానీ... చూసినంత తేలిక కాదు చేయడం’’ అని సన్ని లియోన్ చెప్పుకొచ్చారు. -
ప్రేమ కథలకూ సిద్ధమే!
మంచి స్క్రిప్టులు దొరకాలే కానీ మరిన్ని ప్రేమకథా సినిమాల్లో నటించేం దుకు అభ్యంతరం లేదని జాతీయ అవార్డు గ్రహీత, మరాఠీ నటుడు ఉపేంద్ర లిమయే అంటున్నాడు. గిరీశ్ మోహితే తాజాగా రూపొందిస్తున్న ‘గురుపూర్ణిమ-ఏక్ లవెబుల్ స్టోరీ’ మనోడి తాజా సినిమా. సినిమాకు సంబంధించి అన్నింటికంటే తనకు కథే ముఖ్యమని, అదే ప్రేమకథైనా ఫర్వాలేదనని స్పష్టం చేశాడు. ‘మంచి స్క్రిప్టులు ఉంటే రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి అభ్యంతరాలు లేవు. నా వరకైతే కథే కీలకం. ఆసక్తికరంగా అనిపించే స్క్రిప్టుల కోసం నిరంతరం అన్వేషిస్తుంటాను’ అని ఉపేంద్ర వివరించాడు. గురుపూర్ణిమలో ఉపేంద్ర సరసన సాయి తమహంకర్ కనిపిస్తుంది. కాలేజీ యువలెక్చరర్, విద్యార్థిని మధ్య నడిచే ప్రేమ వ్యవహారం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘గురుపూర్ణిమ నా మొదటి ప్రేమకథా సినిమా కాదు. నాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన జోగ్వా చిత్రంలోనూ ప్రేమకథ ఉంటుంది. ఇందులో సామాజిక సందేశం ఉన్నప్పటికీ, ఇది రొమాంటిక్ సినిమాయే’ అని ఉపేంద్ర వివరించాడు. ఇక గురుపూర్ణిమ సినిమా ట్రైలర్‌ను నిర్మాత మేధా మనోజ్ కాకులో, దర్శకుడు గిరీశ్, చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఇటీవల ముంబైలో విడుదల చేశారు. ఇది సెప్టెంబర్ 12న థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రేమకథా సినిమాలతో ఉపేంద్ర బిజీగా ఉంటున్నా, కెరీర్లో ప్రారంభంతో మాత్రం ముక్తా, కల్ కా ఆద్మీ వంటి యాక్షన్ సినిమాలనే ఎంచుకున్నాడు. మధుర్ భండార్కర్ తీసిన ట్రాఫిక్సిగ్నల్, పేజ్ 3, చాందినీబార్ వంటి హిందీ సినిమాల్లోనూ నటించాడు. భారతీయ సినిమా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుందని, దానికి తగ్గట్టుగానే నటుడు స్క్రిప్టులను ఎంచుకోవాలని ఉపేంద్ర లిమయే అన్నాడు.