Basketball Player
-
సూపర్‌స్టార్ ముచ్చట్లు లేక వెలవెల.. ఎందుకీ మౌనం?
లాస్ ఏంజెలిస్ (అమెరికా): విఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ ట్వీట్లు, పోస్ట్‌లకు విరామం ఇస్తానని ప్రకటించి తన అభిమానులను కాస్త నిరాశపరిచాడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో ఆల్‌టైమ్ బెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్న అతనికి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (పాత ట్విట్టర్)లో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జేమ్స్ ఆకస్మిక నిర్ణయానికి కారణం లేకపోలేదు.సమాజానికి తన సైలెన్స్‌తో సందేశం ఇవ్వడానికే సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అతని సహచరుడు కెవిన్ డ్యురంట్ మేనేజర్ రిచ్ క్లీమన్ ఇటీవల సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అసత్య, ప్రతికూల వార్తలు మన కళ్లను గుడ్డిగా నమ్మేలా చేయడంపై ప్రముఖంగా ప్రస్తావించాడు. దీన్ని ఉటంకిస్తూ... వైరల్ అవుతున్న వార్తల్లో ‘రియల్’ కనిపించకపోవడం తనని కూడా కదిలించేలా చేసిందని, అందుకే ఈ విరామం అని లెబ్రాన్ జేమ్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మిలియన్లు (15 కోట్ల 90 లక్షల మంది), ‘ఎక్స్’లో 52.9 మిలియన్ల (5 కోట్ల 20 లక్షల 90 వేల మంది) అభిమానులు లెబ్రాన్ను సోషల్ మీడియాలో అనుసరిస్తారు. అతని ట్వీట్‌కు జై కొడతారు... పోస్ట్ పెడితే పండగ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్లందరూ తమ సూపర్‌స్టార్ ముచ్చట్లు లేక వెలవెలబోనున్నారు. ఎన్బీఏలో జేమ్స్ జగద్విఖ్యాత బాస్కెట్‌బాలర్. త్వరలోనే 40వ పడిలో అడుగిడబోతున్నా... ఈ వెటరన్ స్టార్‌కు ఆటపై పస, ధ్యాస ఏమాత్రం తగ్గలేదు. ఎన్బీఏలో నాలుగుసార్లు, ఒలింపిక్స్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడైన లెబ్రాన్ లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కు ఆడుతున్నాడు. -
వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!
‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్‌ఛైర్ స్పోర్ట్స్‌లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్‌ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్‌బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్‌లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్గ్వాలియర్లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.ఒలింపిక్స్ నా లక్ష్యంఒలింపిక్స్లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వీల్‌ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. – కోటేశ్వర్ నాయక్ – చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ -
వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!
ఆస్ట్రేలియా(కాన్బెర్రా): మనిషి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ సోషల్ మీడియాలోనే అధికంగా పంచుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు నెటిజన్లు తమ పెంపుడు జంతువుల విన్యాసాలను షేర్ చేస్తుంటారు. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు శునకం. విశ్వాసం చూపడంలో ఇది ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్క యోగాసనాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో గొర్రెలకు కాపలా ఉండే ఆ శుకనం పేరు సీక్రెట్. ఈ శునకం చాపపై యోగా చేస్తూ.. దాని యజమాని మేరీని అనుకరిస్తుంది. ఈ వీడియోను "మై ఆసి గాల్" అనే క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను మాజీ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్" ఈ కుక్క వాస్తవానికి యోగా చేస్తోంది." అనే క్యాప్సన్‌తో ట్విట్టలో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది. కాగా, దీనిపై నటుడు ఆష్కా గోరాడియా స్పందిస్తూ.. "మధురమైన కన్నీళ్లు ... నిన్ను ఏ కంటెంట్ కూడా అధిగమించదు ... ఇది నిజమైన ప్రేమ" అని కామెంట్ చేశారు. "సో క్యూట్! మీరు మీ శునకానికి యోగా నేర్పడానికి ఎంత సమయం పట్టింది?’’ అంటూ మరో నెటిజన్ ఆసక్తి కనబరిచారు. This dog is actually doing yoga... pic.twitter.com/d7oK5EJa2l — Rex Chapman🏇🏼 (@RexChapman) May 17, 2021 (చదవండి: Rahul Gandhi: ప్రజలు అడిగే ప్రశ్నలను కాదు..కరోనాను ఆపండి) -
ఆట ఆడుతూ ఉండు
విధి మన ఆటను సడన్‌గా మారుస్తుంది. మనం ఏదో గోల్ అనుకుని వెళుతూ ఉంటాం. అది గేమ్‌ను తిరగేసేస్తుంది. పరిగెత్తేవారిని కూచుండి పోయేట్టు... కూచున్నవారిని పాకుతూ వెళ్లేట్టు చేస్తుంది విధి. అయితే మనం ఓడిపోతామా? కొత్త ఆట మొదలెడతాం. కొత్త గోల్‌ను సెట్ చేసుకుంటాం. బంతి ఎప్పుడూ విధి చేతిలోనే ఉండదు. మన దగ్గరికీ వస్తుంది. అప్పుడు లాగి పెట్టి కొట్టడమే. కశ్మీర్‌కు చెందిన ఇష్రత్ అఖ్తర్ చేస్తుంది అదే. అల్లర్ల వల్ల కాళ్లు పోగొట్టుకున్నా వీల్ చైర్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా స్ఫూర్తినిస్తోందా అమ్మాయి. ఈ సంవత్సరం అంతా సజావుగా జరిగి ఆగస్ట్‌లో ‘పారలింపిక్స్’ (దివ్యాంగుల ఒలింపిక్స్) టోక్యోలో జరిగితే మనం ఇష్రత్ అఖ్తర్ పేరు తప్పక వింటాం. ఆ అమ్మాయి భారతదేశం తరుఫున ఆ పోటీలలో వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా–ఓషెనియా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున ఆడిన ఇష్రత్ గొప్ప ప్రతిభను ప్రదర్శించింది. కోవిడ్ వల్ల 2020లో జరగాల్సిన పారలింపిక్స్ 2021కు జరపబడ్డాయి. అయినా సరే ఉత్సాహం నీరుగారిపోకుండా బారాముల్లాలోని తన ఇంటి వద్దే రేయింబవళ్లు ప్రాక్టీస్ చేస్తోంది ఇష్రత్. అయితే ఇంత ప్రావీణ్యం ఉన్న అమ్మాయి నిజంగా బాస్కెట్‌బాల్ ప్లేయర్ కాదు. విధి విసిరిన సవాలుకు ఆమె అలా స్పందించింది. మేడ మీద నుంచి దూకేసి ఇష్రత్ అఖ్తర్‌ది బారాముల్లాలోని బంగ్దారా అనే గ్రామం. 2016లో ఆమెకు 19 ఏళ్లు. చదువుకుంటోంది. కాని ఆ సంవత్సరం కశ్మీర్లో అతి పెద్ద ఉగ్రవాది అయిన బర్హాన్ వని ఎన్కౌంటర్ జరిగింది. జూలైలో ఈ ఎన్కౌంటర్ జరిగితే అప్పటి నుంచి జమ్ము కాశ్మీర్ అంతా నిరసనలు అల్లర్లు పెరిగిపోయాయి. ఆగస్టు 24న కొందరు కుర్రాళ్లు భద్రతా దళాల మీద రాళ్లు విసురుతూ ఇష్రత్ ఇంట్లోకి వచ్చి దాక్కున్నారు. వారిని వెంటాడుతూ వచ్చిన భద్రతా దళాలు ఇష్రత్ ఇంటిని చుట్టుముట్టాయి. ఇష్రత్ ఈ గొడవకి గందరగోళానికి బాగా భయపడిపోయి తన ఇంటి రెండో అంతస్తుకు చేరుకుంది. కుర్రాళ్ల వల్ల లేదంటే లోపలికి వచ్చిన భద్రతాదళాల వల్ల ఏం జరుగుతుందోనని కంగారులో పై నుంచి దూకేసింది. అంతే ఆమెకు ఆ తర్వాత ఏమీ తెలియదు. కళ్లు తెరిచే సరికి రెండు కాళ్లూ చలనం కోల్పోయాయి. ఆమె వెన్నుముకకు సర్జరీ చేసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. 6 నెలలు మంచాన ఉండి.. ‘హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి తెస్తే అందరూ శవం వచ్చినట్టుగానే శోకం ప్రకటించారు. చలనం లేని నా దేహం శవమే కదా. ఆరునెలలు మంచాన ఉన్నాను. చాలా డిప్రెషన్ వచ్చింది. అప్పుడు మా నాన్న అబ్దుల్ రషీద్ దగ్గరలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థకు తీసుకెళ్లడం మొదలెట్టాడు. అక్కడంతా నాలాంటి వాళ్లే. అవయవాలు కోల్పోయిన వాళ్ళు’ అంది ఇష్రత్. ‘ఆమె తనలాంటి వాళ్లను చూసి ధైర్యం తెచ్చుకోవాలని ఆ పని చేశాను’ అంటాడు అబ్దుల్ రషీద్. అక్కడే కొందరు దివ్యాంగులు వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆడుతుంటే ఇష్రత్‌కు కూడా ఆసక్తి కలిగింది. వెళ్లి వాళ్లతో ఆడటం మొదలెట్టింది. అప్పటి వరకూ ఆమెకు ఆ ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆమె ఆడుతున్న పద్ధతి చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ సమయంలోనే శ్రీనగర్‌లో జరుగుతున్న వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ల క్యాంప్ గురించి ఇష్రత్‌కు తెలిసింది. తండ్రితో అక్కడకు వెళితే సెలెక్టర్లు ఆమె ప్రతిభను చూసి నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ చేశారు. మొత్తం జమ్ము కశ్మీర్ నుంచి ఒక్క ఇష్రతే ఇందుకు సెలెక్ట్ అయ్యింది. చెన్నైకు వెళ్లి 2020లో టోక్యోలో జరగనున్న పారాలింపిక్స్‌లో పాల్గొనడానికి చెన్నైలో ‘వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (డబ్లు్యబిఎఫ్ఐ) నేషనల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అది ఆగస్టు 2019. సరిగ్గా ఆ సమయంలోనే జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. నేషనల్ టీమ్ మెంబర్‌గా ట్రయినింగ్ తీసుకోవాల్సిన ఇష్రత్‌కు అసలు సమాచారమే అందలేదు. కాని ఆగస్టు 25న కోచ్ లూయిస్ జార్జ్ ఒక రిటైర్డ్ ఇంటెలిజన్స్ అధికారితో యధాలాపంగా ఈ ప్రస్తావన చేస్తే ఆ అధికారి తన సోర్స్ ద్వారా సైన్యానికి ఈ సంగతి చేరవేసి హుటాహుటిన ఇష్రత్‌ను చెన్నై వచ్చేలా చేశారు. భారత సైన్యం ఇందుకు సహకరించింది. చెన్నైకు చేరిన ఇష్రత్ ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో విశేష ప్రతిభ కనిపించడంతో ఆమె జీవితమే మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రశంసించింది. ప్రోత్సహించింది. ‘నన్ను నా వంటి వారిని స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇమ్మని పిలుస్తున్నారు’ అంటోంది ఇష్రత్. ఇష్రత్ నిజంగానే స్ఫూర్తి ఇస్తోంది. కాళ్లు లేకపోతే ఏమి. రెక్కల్లో బలం ఉంది. ఆమె ఎగురుతూనే ఉంటుంది. గోల్స్ కొడుతూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
లేకున్నా ఇవ్వొచ్చు
కష్టంలో చెయ్యి చాచలేని వారుంటారు. కష్టాన్ని చూసి మనమే చెయ్యి చాచాలి. ఇరవై ఉంటే పది ఇవ్వొచ్చు. రెండు గుప్పెళ్లుంటే గుప్పెడు ఇవ్వొచ్చు. కష్టంలో కాళ్లు లేని వారూ ఉంటారు. కష్టాన్ని చూసి మనమే దగ్గరికి వెళ్లాలి. మాలతి దగ్గర ఇరవై ఉన్నాయి. రెండు గుప్పెళ్లూ ఉన్నాయి. కష్టాన్ని చూడలేని మనసూ ఉంది. వెళ్లి ఇవ్వడానికే.. ఆమెకు కాళ్లు లేవు! అయినా ఆగలేదు. లాక్డౌన్ కష్టాల్లో ఉన్న ‘పీసీ’ మహిళల కోసం ఒక నెట్‌వర్క్‌నే నడిపిస్తున్నారు!! బ్యాంకు ఉద్యోగి మాలతీ రాజా. ‘బార్క్లేస్’ బ్యాంకు చెన్నై శాఖలో పర్సనల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో పని చేస్తుంటారు. బార్క్లేస్ లండన్ బ్యాంక్. 330 ఏళ్ల నుంచి ఉంది. చెన్నై శాఖను నిలదొక్కుకునేలా చేయడం కోసం ఆ బ్యాంక్ నియమించుకున్న మెరికల్లాంటి సిబ్బందిలో.. కాళ్లలో శక్తి లేని మాలతీ కూడా ఒకరు. అవును. వీల్ చెయిర్ లేకుండా ఆమె కదలలేరు. లాక్డౌన్ ముందు వరకు ఆఫీస్‌కి వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఇంట్లోంచే పని చేస్తున్నారు. బ్యాంకు పనితో పాటు.. ఇంట్లోంచి మాలతీ చేస్తున్న పని ఇంకొకటి కూడా ఉంది. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో పీసీ (ఫిజికల్లీ ఛాలెంజ్డ్) మహిళల చేత పని చేయించడం! వాళ్లు చేసే పని.. షెల్టర్ చుట్టు పక్కల ఉన్న తమ లాంటి వారి కనీస నిత్యావసరాలు తీరేలా చేయడం. వాళ్ల కోసం ఉతికి వాడుకోదగిన (రీయూజబుల్) మాస్క్‌లను, శానిటరీ ప్యాడ్స్‌ను తయారు చేయడం. పసిపిల్లల కోసం డైపర్స్ చేయడం. మాలతి చెబితే వాళ్లెందుకు చేస్తారు? మాలతి టీమ్ మేట్స్ మెటిల్డా, మేరీ, కలై, నదియా, కవిత.. ఇంకా కొందరు ఆ షెల్టర్‌లోనే ఉంటున్నారు. టీమ్ మేట్స్ అంటే బ్యాంక్ టీమ్ మేట్స్ కాదు. వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఉమెన్ టీమ్ మేట్స్. మాలతి నేషనల్ చాంపియన్. టోర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాంకు ఆమెను డిస్టర్బ్ చేయదు. ప్రాక్టీస్ చేసుకోనిస్తుంది. ∙∙ తమిళనాడు మొత్తం మీద 150 మంది వీల్‌చెయిర్ మహిళా బాస్కెట్‌బాల్ ప్లేయర్లు ఉన్నారు. కోయంబత్తూరు, తిరుచ్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, వెల్లూరు.. మరికొన్ని ప్రాంతాల నుంచి వారం చివరిలో వాళ్లంతా చెన్నై వస్తారు. మాలతితో కలిసి జె.జె. కిల్పాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. కొందరు చెన్నై షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ల చేతే మాలతి ఇప్పుడు నిరాశ్రయులైన పీసీ మహిళలకు చేయూతను ఇప్పిస్తున్నారు. షెల్టర్‌లో మాస్క్‌లు కుడుతున్న మాలతి టీమ్ మేట్ బాగా అవసరంలో ఉన్నవారికి ఉప్పు, పప్పులతో పాటు కొంత డబ్బు కూడా. ఆ డబ్బును మాలతే తన ఫేస్బుక్ నుంచి విరాళాల ద్వారా సేకరిస్తున్నారు. నిజానికి ఆమెకు పెద్ద సర్కిలే ఉంది. బ్యాంకుతో ఏర్పడింది కొంత. క్రీడాకారిణిగా సాధించుకున్నది కొంత. వాళ్లంతా మాలతికి అన్ని విధాలా సహాయంగా ఉన్నారు. ‘ఫలానా చోట.. ఫలానా మహిళ.. ఆమె కదల్లేదు.. ఆమె కుటుంబం కష్టంలో ఉంది’ అని మాలతి మెజేస్ ఇస్తే చాలు.. వెంటనే అక్కడి వెళ్లి చేయగలిగినంతా చేసి వస్తున్నారు. ఇటువైపు షెల్టర్‌లో మాలతి సూచనల ప్రకరాం.. ఆమె టీమ్ మేట్స్, మిగతా మహిళలు తాము చేయగలిగింది చేస్తున్నారు. మొత్తం ముప్పైమంది వరకు ఉంటారు షెల్టర్‌లో. వారంతా రోజుకు పది గంటల పాటు పని చేస్తూ కనీసం 300 సింగిల్, డబుల్ లేయర్ల మాస్క్‌లతో పాటు.. శానిటరీ నేప్కిన్స్, బేబీ డైపర్స్ కుడుతున్నారు. అవన్నీ కూడా ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ మహిళల కోసమే. వాళ్లలా రెడీ చెయ్యగానే ‘అందుబాటులో ఉన్నాయి. అవసరమైనవారు సంప్రదించవచ్చు’’ అని మాలతి ఇలా ఫేస్బుక్లో పెట్టేస్తారు. డబ్బు పెట్టగల ఎన్జీవోలు వాటిని కొని, వైకల్యం ఉన్న మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ఆ డబ్బును మళ్లీ రేషన్ పంపిణీ చేసేందుకు ఖర్చు చేయిస్తారు మాలతి. ఈ లాక్డౌన్లో ఉన్నచోటు నుంచి కదలకుండా మాలతి ఇప్పటి వరకు 200 మంది వైకల్యం గల మహిళలకు డ్రై రేషన్ (వండుకోడానికి అవసరమైన దినుసులు), మందులు, ఇతర నిత్యావసరాలు పంపించగలిగారు. మాలతి కుటుంబానికి కూడా పూర్తిగా ఆమే ఆధారం. ఆమెతో కలిపి మొత్తం ఐదుమంది ఉంటారు. ‘‘లాక్‌డౌన్‌తో నేను పోషించవలసిన కుటుంబం మరింత పెద్దదైంది’’ అంటారు మాలతి.. చిరునవ్వుతో. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో మాలతీ టీమ్ మేట్స్, ఇతర మహిళలు. -
‘చోటూ’ బన్‌గయా సూపర్ హీరో
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలో మారుమూల గ్రామం బల్లోకే. ఈ గ్రామ జనాభా 700. అందరూ వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామంలో జన్మించిన సత్నామ్ ఎత్తు 7 అడుగుల 2 అంగుళాలు. అయితే ఈ ఆజానుబాహుడిని ఆ ఊరిలో అందరూ ‘చోటూ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ ఊళ్లో అతనికంటే ఎత్తుగా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారట. సత్నామ్ తండ్రి బల్బీర్ సింగ్ ఎత్తు కూడా 7.2 అడుగులు. ఆయన గోధుమలు పండిస్తారు. తొమ్మిదేళ్ల వయసు వరకు సత్నామ్‌కు బాస్కెట్‌బాల్ అంటే ఏంటో తెలియదు. ఆ తర్వాత స్కూల్లో ఈ ఆట గురించి తెలిసి ఆసక్తి పెంచుకున్నాడు. ఆ గ్రామంలో ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో 12 ఏళ్ల వయసులో సమీప పట్టణంలోని అకాడమీలో చేర్పించారు. కానీ అక్కడ కూడా సదుపాయాలు లేవు. అయినా కష్టపడ్డాడు. తనలో ఉన్న నైపుణ్యానికి ఎత్తు అదనపు బలంగా మారింది. అంతే... జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ పెద్దలను ఆకర్షించాడు. దీంతో 2010లో ఫ్లోరిడాలోని ఐఎంజీ రిలయన్స్ అకాడమీలో మూడు నెలల శిక్షణ కోసం మరో 29 మందితో కలిసి వెళ్లే అవకాశం లభించింది. ఇది తన తలరాతను మార్చింది. అక్కడ సత్నామ్ నైపుణ్యం చూసి ఇక మళ్లీ భారత్‌కు పంపించలేదు. అక్కడే ఐఎంజీ అకాడమీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చిన్న చిన్న లీగ్‌లు ఆడాడు. ఇప్పుడు అనూహ్యంగా ఎన్బీఏలో అడుగుపెడుతున్నాడు. ఈ ఘనతతో భారత బాస్కెట్‌బాల్‌లో చోటూ సూపర్ హీరోగా మారాడు. యావో మింగ్ మాదిరిగా..! భారత్ అంటే క్రికెట్... ఇక్కడ బాస్కెట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేదు. పాఠశాలలు, కళాశాలల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా పట్టించుకోరు. కానీ అమెరికాలో ఈ క్రీడ అంటే పిచ్చి. ఎన్బీఏ మ్యాచ్‌ల కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తారు. మైకేల్ జోర్డాన్ లాంటి దిగ్గజం ఆడిన ఆ సర్క్యూట్లో మన దేశం నుంచి ఓ క్రీడాకారుడు ఆడతాడనేది ఇప్పటిదాకా ఊహకు అందని విషయం. ఈ సీజన్లో భుల్లర్ అనే భారత సంతతి ఆటగాడు (కెనడా) ఎన్బీఏలో ఆడాడు. ఇప్పుడు సత్నామ్ కేవలం 19 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం. బాస్కెట్‌బాల్ ఇప్పటికే ఆడుతున్న యువకులంతా సత్నామ్ స్ఫూర్తిగా మరింత కష్టపడతారు. గతంలో చైనాలోనూ బాస్కెట్‌బాల్‌కు ఆదరణ లేదు. అయితే అక్కడి నుంచి యావో మింగ్ వెళ్లి ఎన్బీఏలో ఆడిన తర్వాత ఆ దేశంలో విపరీతంగా ఆదరణ పెరిగింది. ఇవ్వాళ చైనా ఆసియాలో పెద్ద శక్తిగా ఎదిగింది. యావో మింగ్ తరహాలోనే సత్నామ్ కూడా భారత్‌లో ఆట రాతను మారిస్తే అంతకంటే కావల్సింది ఏముంటుంది. -సాక్షి క్రీడావిభాగం -
సత్నామ్ సంచలనమ్!
♦ ఎన్బీఏ లీగ్‌లోకి ఎంపికైన తొలి భారత ఆటగాడిగా చరిత్ర ♦ డల్లాస్ మావెరిక్స్ జట్టుకు ఎంపిక న్యూయార్క్ : భారత్‌కు చెందిన యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్నామ్ సింగ్ భమరా కొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని ప్రఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లీగ్‌లో ఆడేందుకు ఈ 19 ఏళ్ల క్రీడాకారుడు ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు సత్నామ్. గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన ఎన్బీఏ డ్రాఫ్ట్‌లో ఇతడిని ‘డల్లాస్ మావెరిక్స్’ జట్టు ఎంపిక చేసుకుంది. అలాగే దశాబ్ద కాలంలో కళాశాల లేక ప్రొఫెషనల్ అనుభవం లేని ఆటగాడు ఎన్బీఏకు ఎంపికవడం కూడా ఇదే తొలిసారి. 2005లో డ్రాఫ్ట్ అర్హత నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్‌లోకి రావాలంటే ఓ ఆటగాడు హైస్కూల్లో ఏడాదిపాటు ఎన్బీఏ ‘డి’ లీగ్‌లో ఆడాలి. లేదా విదేశాల్లో ప్రొఫెషనల్‌గా ఆడిన అనుభవమైనా ఉండాలి. కానీ ఇవేమీ సత్నామ్ సింగ్‌కు లేవు. అతడికున్న అత్యున్నత అనుభవమల్లా భారత జాతీయ జట్టుకు ఆడటమే. సత్నామ్‌ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని డల్లాస్ జట్టు యజమాని మార్క్ క్యూబన్ అన్నారు. ఇప్పుడు తమ జట్టుకు భారత్ రూపంలో వంద కోట్లకు పైగా అభిమానులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రశంసల వర్షం : సత్నామ్ సింగ్‌పై భారత్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘ఈ వార్త తెలిసి చాలా సంతోషపడ్డాను. ఓ భారత ఆటగాడికి ఇది పెద్ద ఘనత. అందరూ గర్వించదగ్గ విషయం. రాబోయే సీజన్‌తో పాటు కెరీర్లో మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా భారత్ అంతా అతడి వెనుకే ఉంటుంది’ అని సచిన్ అన్నాడు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, గుత్తా జ్వాల, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ జట్లు సత్నామ్‌కు అభినందనలు తెలిపాయి. ఇది కలా.. నిజమా అనే స్థితిలో ఉన్నాను. కానీ నేను ఎన్బీఏలో చోటు సాధించాననే విషయం వాస్తవం. భగవంతుడి దయతో నా కల నిజం చేసుకున్నాను. ఈ సమయంలో నా కుటుంబం, తొలి కోచ్ సుబ్రమణ్యంలను తలచుకోకుండా ఉండలేను. ఈ ఫీట్‌తో భారత్ నుంచి కూడా చాలా మంది వర్ధమాన ఆటగాళ్లు నాలాగే పెద్ద ఆశయాలు పెట్టుకునేందుకు అవకాశం కలిగింది. కచ్చితంగా రాబోయే రోజుల్లో బాస్కెట్‌బాల్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు క్రికెట్‌ను ఆభిమానించినట్టే ఈ ఆటను కూడా చూస్తారు. - సత్నామ్ -
జగమంత వైద్య కుటుంబం
జైపూర్: ఒక కుటుంబంలో ఇద్దరో, ముగ్గురో డాక్టర్లుంటేనే ‘వాళ్లది డాక్టర్ల కుటుంబం’ అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఒక కుటుంబంలో ఏకంగా 31 మంది డాక్టర్లుంటే? డాక్టర్ల వంశం అనాలా, డాక్టర్ల ప్రపంచం అనాలా.. మీరే తేల్చుకోండి! అలాంటి అరుదైన కుటుంబం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉంది. తాజాగా అందులోని వినమృతా పత్ని అనే విద్యార్థిని(17)కి కూడా ఎంబీబీఎస్‌లో సీటొచ్చింది. రాజస్థాన్ ప్రీ-మెడికల్ టెస్ట్‌లో ఆమెకు 107వ ర్యాంకు లభించింది. ఆమె కోర్సు పూర్తి చేస్తే కుటుంబంలో వైద్యుల సంఖ్య 32కు చేరుతుంది. వినమృత చదువులోనే కాదు ఆటల్లోనూ ముందుంది. అండర్-19 యువతుల విభాగంలో ఆమె రాష్ట్రంలో ఉత్తమ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. రెండు తరాలుగా: వినమృత కుటుంబంలో రెండు తరాలుగా డాక్టర్లు తయారవుతున్నారు. ఆమె తాత న్యాయవాది అయినప్పటికీ తన వారసులు ప్రజాసేవ చేసే వృత్తిలో చేరాలని ఆశించాడు. ఆయన 8 మంది సంతానంలో ఏడుగురు డాక్టర్లు. వినమృత తండ్రి తరుణ్ వారిలో ఒకరు. ఆమె తల్లి వినీత కూడా వైద్యురాలే. తరుణ్ చిన్నపిల్లల వైద్యుడు కాగా వినీత స్త్రీవ్యాధుల నిపుణురాలు. వినమృత అన్నయ్య తన్మయ్ కూడా ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వినమృత చిన్నాన్నలు, పిన్మమ్మలు, మేనత్తలు, మేనమామల్లో కూడా చాలా మంది స్టెతస్కోప్ పట్టుకున్న వాళ్లే. వీరిలో ఏడుగురు ఫిజీషియన్లు, ఐదుగురు గైనకాలజిస్టులు, ముగ్గురు ఈఎన్టీ వైద్యులు తదితరులు ఉన్నారు. వీరిలో 20 మంది సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ‘వైద్య వృత్తి ఎంచుకోవాలని నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. నా తల్లిదండ్రులు పేదలకు అంకితభావంతో చికిత్స చేయడం చూశాను. బాల్యం నుంచి డాక్టర్ కావాలనుకున్నాను. అందుకే వేరే వృత్తి అన్న ఆలోచేనే రాలేదు. నా కుటుంబం నాకు గర్వకారంణం’ అని వినమృత చెప్పింది. -
చూసినంత తేలిక కాదు చేయడం
సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని, బాలీవుడ్లో పాపులర్ అయిపోయారు. ఇప్పుడామె బాలీవుడ్లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి. తాను ప్రత్యేక పాత్ర పోషించిన ‘హేట్ స్టోరి 2’ ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు సన్నీ. ‘‘నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగినవే. భారతీయ మూలాలున్న నేను అనుకోకుండా నా పదహారో ఏటనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో తప్పు చేశాను. ఆ తప్పే నా జీవితంలో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పంథొమ్మిదేళ్ల వయసులో పోర్న్ మూవీ ఇండస్ట్రీలో ప్రవేశించాను. మంచిగానో చెడుగానో పేరు ప్రఖ్యాతులు వచ్చేశాయి’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు సన్నీ. మామూలు సినిమాల్లో నటించడం కష్టమా? లేక పోర్న్ సినిమాల్లో చేయడం కష్టమా? అనడిగితే -‘‘మామూలు సినిమాల్లో నటించడం కష్టమేం కాదు. కాస్త అందం, అభినయ సామర్థ్యం ఉంటే చాలు... మామూలు సినిమాల్లో నటించేయొచ్చు. కానీ పోర్న్ ిసినిమాలు చేయడంలో మాత్రం చాలా ఇబ్బందులుంటాయి. ఇవి చెప్పుకోలేనివి. అసలు అంతమంది ముందు అలా చేయడానికే ధైర్యం కావాలి. ఎంతో మానసిక దృఢత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. చాలామంది పోర్న్ ఫిలిమ్స్‌ని ఇష్టంగా చూస్తారు. కానీ... చూసినంత తేలిక కాదు చేయడం’’ అని సన్ని లియోన్ చెప్పుకొచ్చారు.