కొత్త సంవత్సరంలో సూపర్‌పోలీస్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా జంటగా నటించిన తుపాన్ చిత్రం కోలీవుడ్‌లో సూపర్‌పోలీస్‌గా అనువాదం అవుతున్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ సమర్పణలో స్వాతి, వర్షిణిల భద్రకాళీ ఫిలింస్ పతాకంపై భద్రకాళీ ప్రసాద్ అందిస్తున్న ఈ చిత్రానికి అపూర్వ లాఖియా దర్శకుడు. సత్యసీతల, అడ్డాలవెంకట్రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్‌దత్ ప్రధాన పాత్రను పోషించగా, ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, శ్రీహరి, మహిగిల్, అతుల్‌కులకర్ణి ముఖ్య పాత్రలను పోషించారు. ఏఆర్‌కే రాజరాజా సంభాషణలను అందించిన ఈ సూపర్‌పోలీస్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా మాటల రచయిత ఏఆర్‌కే.రాజరాజా మాట్లాడుతూ ఇది ఒక నిజాయితీ గల పవర్‌ఫుల్ పోలీస్ అధికారి ఇతివృత్తంతో సాగే పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రం అన్నారు. ఇందులో 11 ఒళ్లు గగుర్పొడిచే పోరాట దృశ్యాలు యువతను ఉర్రూతలూగించే ఆరు గీతాలు ఉంటాయన్నారు. అందులో ఐదు ఐటమ్ సాంగ్స్ కావడం విశేషం అన్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం జెడ్పీస్పీడ్‌లో సాగుతుందని చెప్పారు.
వచ్చే ఏడాది అరడజనుకు పైనే...
చిత్ర నిర్మాత భద్రకాళీ ప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థ నుంచి ఈ ఏడాది అరడజను చిత్రాలు విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది ఇదే విధంగా అరడజనుకు పైగా చిత్రాలను విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అందులో తొలి చిత్రం ఈ సూపర్‌పోలీస్ అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని జనవరి ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. రెండవ చిత్రంగా దివంగత మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన వారుసుడు నాగార్జున, ఆయన కొడుకు నాగచైతన్య మొదలగు మూడు తరాల నటులు నటించిన సూపర్‌హిట్ తెలుగు చిత్రం మనంను తమిళంలో అనువదించనున్నట్లు చెప్పారు. అదే విధంగా పవన్ కల్యాణ్ హీరోగా ఘన విజయం సాధించిన అత్తారింటికి దారేది, నిఖిల్ నటించిన కార్తికేయ చిత్రాలను తమిళంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే రామ్ చరణ్ హీరోగా నటించనున్న నూతన చిత్రాన్ని తమిళంలో తామే విడుదల చేయనున్నట్లు చెప్పారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తరకెక్కుతున్న భారీ చిత్ర తమిళ హక్కుల్ని పొందే ప్రయత్రాలు చేస్తున్నట్లు భద్రకాళీ ప్రసాద్ తెలిపారు.