'అందరి ముందు తినాలంటే సిగ్గు' | Superstar Shy About Eating In Front Of People | Sakshi
Sakshi News home page

'అందరి ముందు తినాలంటే సిగ్గు'

Published Fri, Jul 29 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

'అందరి ముందు తినాలంటే సిగ్గు'

'అందరి ముందు తినాలంటే సిగ్గు'

బాలీవుడ్ స్టార్ హీరోలలో అభిమానులతో తన అనుభవాలను, ఇష్టా ఇష్టాలను మొహమాటం లేకుండా పంచుకునే హీరో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్. తను పడ్డా కష్టాలతో పాటు ఇప్పుడు స్టార్ డమ్ను కాపాడుకోవటానికి తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో కూడా తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటుంటాడు బాద్షా.

ఇటీవల ఫ్యాన్స్తో నిర్వహించిన లైవ్ వీడియో చాట్లో తన ఆహారపు అలవాట్ల గురించి అభిమానులకు తెలియజేశాడు. ఫిట్గా ఉండేందుకు పక్కా డైట్ ఫాలో అయ్యే షారూఖ్, రెగ్యులర్గా గ్రిల్డ్ చికెన్, మొలకలు, బ్రోకొలి, పప్పు మాత్రమే తీసుకుంటాడట. అంతేకాదు ఏదైనా పార్టీకి వెళ్లినా.. ఇంట్లో వండిన ఆహారం తినడానికే ఇష్టపడతాడట.

ముఖ్యంగా ఫంక్షన్స్, పార్టీలలో చాలా మంది ముందు తినటానికి ఇబ్బందిగా ఉంటుదన్నాడు షారూఖ్. తనలా ఫర్ఫెక్ట్ బాడీ మెయిన్టైన్ చేయడానికి అభిమానులకు టిప్స్ కూడా చెప్పాడు. ప్రతీరోజు తప్పకుండా వ్యాయామం చేయాలని, భోజనం చేసేప్పుడు మితంగా తినాలని, అది కూడా కింద కూర్చొని తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement