
సూర్య
రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావడానికి నంద గోపాల కుమారన్ (యన్‌జీకే) సిద్ధమయ్యాడు. మరి అతని ప్రయత్నాలు సఫలమయ్యాయో? లేదో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యన్‌జీకే’ (తెలుగులో ‘నంద గోపాల కృష్ణ’). పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్‌ఆర్ ప్రభు నిర్మించారు. సాయి పల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించారు.
ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సినిమాలో యువ రాజకీయనాయకుడిగా సూర్య ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని ఈ చిత్రం టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ‘‘యన్‌జీకే’ డబ్బింగ్ పనులు మొదలెట్టాం. వచ్చే వారంలో విడుదల తేదీని తెలియజేస్తాం’’ అని యస్‌ఆర్ ప్రభు పేర్కొన్నారు. ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాప్పాన్’ సినిమాలో నటిస్తున్నారు సూర్య. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. ఆ నెక్ట్స్ ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment