ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దగ్గర మేనేజర్‌గా పని చేసిన దిశ సలియా ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి ఆమె ముంబైలో తన భవనంలోని 14వ అంతస్థు నుంచి దూకింది. తీవ్ర రక్తస్రావమైన ఆమెను వెంటనే బొరివలిలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు ఆమె ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. దిశ గతంలో కమెడియన్ భారతి శర్మ, నటి రేఖా చక్రబొర్తి, అలనాటి హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ దగ్గర మేనేజర్‌గా పని చేసింది. ఇదిలా వుంటే బాలీవుడ్‌లో లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. (కరోనాతో బాలీవుడ్ నిర్మాత కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment