సాక్షి, న్యూఢిల్లీ: యావత్ బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ అర్ధాంతరంగా తనువు చాలించిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. ఆయన స్వయం కృషితో సినిమా రంగంలో రాణించారు. ఆయన నటించినవి ఏడే ఏడు చిత్రాలైనప్పటికీ వాటిలో ‘కై పూ చీ’ లాంటి మాణిక్యాలు ఉన్నాయి. ‘ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో చేరిన సుశాంత్ అంతకుముందు భౌతిక శాస్త్రంలో ‘నేషనల్ ఒలింపియాడ్’ సాధించారు. దాంతో ఆయన విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆయన కుటుంబ సభ్యులు ఆశించారు. అయితే సుశాంత్ నటన మీదున్న ఆసక్తితో ఢిల్లీలోని బేరి జాన్స్ థియేటర్ గ్రూప్‌లో చేరి నటన నేర్చుకున్నారు. ముంబైలోని శియామక్ దేవర్స్ కంపెనీలో చేరి డ్యాన్సింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు. (సుశాంత్ 50 కోరికల జాబితా ఇదే!)
ఆ తర్వాత హిందీ టెలివిజన్ ద్వారా బాలివుడ్‌లో ప్రవేశించారు. 2009–13 వరకు హిందీ టెలివిజన్‌లో వచ్చిన ‘పవిత్ర రిస్తా’ సీరియల్‌లో నటించారు. ‘జెరా నాచ్కే దిఖా–2, ఝలక్ దిక్లా జా–4’ రియాలిటీ షోల ద్వారా సుశాంత్ తన డ్యాన్సింగ్ స్కిల్స్ నిరూపించుకున్నారు. 2013లో ‘కై పో చే (గుజారాతీ భాషలో ఇతరుల పతంగిని కట్‌చేసి విజేతగా నిలవడం)’ బాలివుడ్‌లో ప్రవేశించి తొలిచిత్రంతోనే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయారు. 2015లో దివాకర్ బెనర్జీ దర్శకత్వంలో వెలువడిన ‘బ్యోమ్‌కేష్ బక్షీ’ చిత్రంలో సుశాంత్ నటించారు. శారదిందు బెనర్జీ రాసిన బెంగాలీ నవల ఆధారంగా ఆ చిత్రాన్ని నిర్మించారు. గతంలో ఇదే నవల బాసు ఛటర్జీ దర్శకత్వంలో 1993–1997 వరకు డీడీ వన్‌లో ధారావాహిక సీరియల్‌గా ప్రసారమై విశేషాధరణ పొందింది. ఆ టీవీ సీరియల్‌లో రజిత్ కçపూర్ డిటెక్టివ్ ‘బ్యోమ్‌కేష్ బక్షీ’గా నటించారు. (బాలీవుడ్‌ను గెలిచిన సుశాంత్‌కు వీడ్కోలు )
Comments
Please login to add a commentAdd a comment