నా చేతిలో ఉన్నవి రెండు సినిమాలే | taapsee denies rumours about sandeep, yash raj films | Sakshi
Sakshi News home page

నా చేతిలో ఉన్నవి రెండు సినిమాలే

Published Wed, Feb 10 2016 2:59 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

నా చేతిలో ఉన్నవి రెండు సినిమాలే - Sakshi

నా చేతిలో ఉన్నవి రెండు సినిమాలే

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాథం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించినా అవి కూడా ఆమె కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు.

దీంతో బాలీవుడ్ బాట పట్టిన తాప్సీ చష్మే బదూర్ సినిమాతో అక్కడ కూడా మంచి గుర్తింపునే సాధించింది. తాజాగా ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉందంటూ వస్తున్న వార్తలపై తాప్సీ స్పందించింది. తన చేతిలో కేవలం రెండు సినిమాలే ఉన్నాయన్న తాప్సీ, ఘాజీతో పాటు, రైజింగ్ సన్ ఫిలింస్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్నానంటూ ప్రకటించింది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో పాటు, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండించింది. కాళీగా ఉన్నప్పుడు కూడా బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు ఇండస్ట్రీ జనాలు. అలాంటిది, ఇలా అవకాశాల్లేవని చెప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావలంటున్నారు విశ్లేషకులు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement