అంతా అబద్ధం
మిల్క్ బ్యూటీ తమన్నా ఓ కంప్యూటర్ ఇంజినీర్‌తో ప్రేమలో పడింది... త్వరలో అతన్నిపెళ్లాడనుందనే వార్త గత రెండు రోజులుగా హల్‌చల్ చేసింది. పెళ్లయ్యాక తమన్నా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేయనున్నారనే వార్త కూడా వినిపించింది. మౌనంగా ఉంటే ఈ ప్రచారం మరింత ఊపు అందుకునే ప్రమాదం ఉందని గ్రహించిన తమన్నా పెదవి విప్పారు. ‘‘అంతా అబద్ధం. నేనెవర్నీ పెళ్లి చేసుకోవడంలేదు.
ఒకవేళ నా జీవితంలో ఎవరైనా ఉంటే... ఆ విషయాన్ని ఈ ప్రపంచానికి చెబుతా’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని ఈ బ్యూటీ పేర్కొన్నారు. పెళ్లి చేసుకోబోతున్నానంటూ ప్రచారం చేసి, నన్ను త్వరగా ఇక్కణ్ణుంచి పంపించాలనుకుంటున్నారేమో అని సరదాగా అన్నారు. ప్రస్తుతం ప్రభుదేవా సరసన ఏకకాలంలో మూడు భాషల్లో రూపొందుతున్న ‘అభినేత్రి’లో నటిస్తున్నాననీ, నటిగా ఈ ఏడాది చాలా ఎగ్జయిటింగ్‌గా ఉండబోతోందనీ చెప్పారు. సో.. తమ్మూ పెళ్లి ఇప్పట్లో లేనట్లే.