ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా | Tamanna Simhadri And Ravikrishna Issue In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

Published Tue, Aug 6 2019 10:54 PM | Last Updated on Tue, Aug 6 2019 11:03 PM

Tamanna Simhadri And Ravikrishna Issue In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌లో తమన్నా-రవికృష్ణ వ్యవహారంలో వ్యక్తిగత దూషణలు స్థాయిని మించడంతో తమన్నాపై మిగతా హౌస్‌మేట్స్‌ ఫైర్‌ అవ్వడం.. తమన్నా ఎంతకీ తగ్గకపోవడం.. చివరకు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ను ఇవ్వడంతో వీటన్నంటికి పుల్‌స్టాప్‌ పడ్డట్టైంది. రవికృష్ణ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తూ.. ఎవరితో మాట్లాడుతూ ఉన్న అక్కడికి వెళ్లి మరీ రెచ్చగొడుతోంది. పక్కనే ఉంటూ ప్రత్యక్ష నరకం చూపుతోంది. మగాడివేనా, పప్పుగాడు అంటూ హేళన చేస్తున్నా.. రవికృష్ణ మాత్రం మౌనంగా ఉంటూ తమన్నాను పట్టించుకోవడం లేదు. హౌస్‌మేట్స్‌ అందరూ తమన్నా చర్యలను వ్యతిరేకిస్తున్నా.. ఆమె మాత్రం రవికృష్ణను టార్గెట్‌ చేస్తూనే ఉంది.

చంద్రముఖి వేశం వేస్తా.. పశుపతి.. అంటూ ఏదోదో పిచ్చిగా వాగుతూనే ఉంది. రవికృష్ణ నవ్వుతూ ఉన్నా సరే.. ఏదో పాట పాడుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంది. మిత్రమా ఇంత స్వార్థమా.. నీచమైన ఆట ఆడావు.. నేను కూడా నీచమైనే ఆట ఆడతాను అంటూ ఏవేవో కారుకూతలు కూసింది. క్షమాపణలు చెబితే కూడా వాడికి తప్పేనంటూ.. ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే అంటూ తమన్నా రెచ్చిపోయింది. తనకింకా సహనమివ్వాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ.. కోపంలో ఒక్కసారిగా ఏం మాట్లాడేస్తానని భయంగా ఉందంటూ మిగతా హౌస్‌మేట్స్‌తో రవికృష్ణ చెప్పుకొచ్చాడు. (అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా)

రోహిణి, శివజ్యోతి, రాహుల్‌, అలీ రెజా ఇలా అందరితో తమన్నా వాగ్వాదానికి దిగుతూనే ఉంది. ఎంతకీ తమన్నా తగ్గడం లేదు. రవికృష్ణపై వ్యక్తిగత దూషణ చేస్తూనే ఉంది. ఇక తమన్నా వ్యవహారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకే అన్నట్లు ఓ టాస్క్‌ను ఇచ్చాడు బిగ్‌బాస్‌. దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్‌లో భాగంగా తికమకపురంలో ఊరి పెద్ద వరుణ్‌ సందేశ్‌,తమన్నాలు ఉండగా.. పనీపాట లేని లాయర్‌ హిమజ.. బద్దకస్తుడైన పోలీస్‌ ఆఫీసర్‌ బాబా భాస్కర్‌.. స్ట్రిక్ట్‌ కానిస్టేబుల్‌గా శివజ్యోతి నటించారు. ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని జైల్లో వేయాలని తెలిపాడు. ఇక టాస్క్‌లో భాగంగా ఊరికి సంబంధించిన నిధిలో ఉన్న వస్తువులను, డబ్బును దొంగతనం చేయడమే దొంగల టార్గెట్‌గా ఉండాలని పేర్కొన్నాడు.

టాస్క్‌లో భాగంగా ఊరిలోని నిధిని, వస్తువులను దొంగతనం చేసేపనిలో ఆ ముగ్గురూ పడ్డారు. ఇక శ్రీముఖిని మాత్రం ఉట్టిపుణ్యానికే అరెస్ట్‌ చేయబోయారు. అయితే డబ్బులిచ్చి ఆ వ్యవహారం సద్దుమణిగేలా చూసుకుంది. ఇక ఊళ్లోని నిధి చుట్టూ రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌ కాపలకాయసాగారు. శ్రీముఖి అల్లరి, బాబా భాస్కర్‌ కామెడీతో సరదాగా గడిచిపోతోన్న ఈ టాస్క్‌ మరునాటికి సీరియస్‌ అయినట్లు కనబడుతోంది. నిధి ఉన్న బాక్స్‌ అద్దాలు పగిలి హౌస్‌మేట్స్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్‌లో గెలుపొంది.. కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారో చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement