
తమన్నా సింహాద్రి నోటికి అడ్డూఅదుపు ఉండదని హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులకు అందరికీ తెలిసే ఉంటుంది. హౌస్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమెను తీసుకొచ్చారా? అంటూ నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తమన్నా ప్రవర్తనతో విసుగెత్తిన ఆడియెన్స్.. ఆమెను ఈవారం బయటకు పంపించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమన్నా ఎలిమినేట్ అవడం గ్యారంటీ అంటూ కామెంట్లుపెడుతున్నారు.
అయితే నిన్నటి నామినేషన్ ప్రక్రియలో తమన్నా వాగిన చెత్త అందరికీ తెలిసే ఉంటుంది. రవికృష్ణ.. తమన్నాను నామినేట్ చేయడంతో మొదలైంది ఈ గొడవ. ఇక అప్పటి నుంచి రవికృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సిగ్గులేదారా?. నువ్ మగాడివేనారా?.. పప్పుగాడు అంటూ హౌస్‌లో పిచ్చిపిచ్చి కూతలు కూస్తూ ఉంది. ఇక నుంచి తనెంటో చూపిస్తానని చెప్పిన తమన్నా.. అన్నంత పని చేసినట్టుగానే కనిపిస్తోంది. తమన్నా.. రవికృష్ణను దూషిస్తూ ఉన్న ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీంట్లో రవికృష్ణను అడుగడుగునా తమన్నా టార్గెట్ చేసినట్లు కనపడుతోంది. అరేయ్ మగాడివేనా? పప్పుగాడు అంటూ మళ్లీ కామెంట్లు చేస్తూ కనపడుతోంది. మరి రవికృష్ణ సైలెంట్‌గానే ఉన్నాడా? లేక తమన్నాకు గుణపాఠం చెప్పాడా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment