
స్క్రీన్ టెస్ట్
► తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఈ తమిళ హీరో స్కూల్‌మేట్?
ఎ) విజయ్ బి) కార్తీ సి) సూర్య డి) విశాల్
► బిగ్ బాస్ ఫైనలిస్ట్ శివబాలాజీకి అల్లు అర్జున్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా పేరేంటి?
ఎ) బన్నీ బి) ఆర్య–2 సి) ఆర్య డి) హ్యాపీ
► మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డు సొంతం చేసుకున్న ఈ నటి ఎవరు?
ఎ) సమంత బి) సోనియా అగర్వాల్ సి) త్రిష డి) సిమ్రాన్
► ‘మైథిలీ ఎన్నై కాదలి’ అనే తమిళ సినిమా ద్వారా అమల కథానాయికగా పరిచయమయ్యారు. ఆ సినిమా దర్శకుడు ఎవరో తెలుసా?
ఎ) బాలచందర్ సి) భారతీరాజా సి) టి.రాజేందర్ డి) మణిరత్నం
► అలీ బాలనటుడిగా పరిచయమైన సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఎ) నిండు నూరేళ్లు బి) సీతాకోకచిలుక సి) నెలవంక డి) పెళ్లిచేసి చూడు
► రవితేజ అనేది సిల్వర్ స్క్రీన్ పేరు. ఆయన అసలు పేరు ఏంటి?
ఎ) రవీంద్రభూపతి బి) రవిశంకర్ రాజు భూపతిరాజు సి) భూపతి రాజు రవి డి) రవి భూపతి రాజు
► హాస్యనటుడు తనికెళ్ల భరణి బెస్ట్ విలన్‌గా అవార్డు అందుకున్న సినిమా పేరు చెప్పండి?
ఎ) శివ బి) లేడీస్‌టైలర్ సి) సముద్రం డి) వారసుడు
► ‘అరుంధతి’ సినిమాలో బొమ్మాళీ నిన్నొదల...’ అంటూ ప్రేక్షకులను భయపెట్టారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఏ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు?
ఎ) అతడు బి) సూపర్ సి) మిస్టర్ మేధావి డి) అశోక్
► ‘జెంటిల్‌మేన్’ సినిమాకు హీరో అర్జున్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కథను దర్శకులు శంకర్ ఒక తెలుగు హీరోకి చెప్పారు. ఆ హీరో ఎవరో ఊహించగలరా?
ఎ) చిరంజీవి బి) విక్రమ్ సి ) నాగార్జున డి) రాజశేఖర్
► దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్టూడియో చెన్నైలోని తన నివాసంలోనే ఉంటుంది. ఆ స్టూడియోలోకి ఎంటర్ కాగానే ఓ మహా సంగీత దర్శకుని చిత్రపటం ఉంటుంది. ఆ ప్రముఖ సంగీత దర్శకులు ఎవరో ఊహించండి?
ఎ) మైఖేల్ జాక్సన్ బి) ఏఆర్ రెహ్మాన్ సి) ఇళయరాజా డి) ఘంటసాల
► స్టిల్ ఫొటోగ్రఫీని ప్రొఫెషన్‌గా ఎంచుకుని, నాలుగేళ్లు ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్న ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్‌లో హ్యాపెనింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఎవరు?
ఎ) జయప్రకాశ్‌రెడ్డి బి) రావు రమేశ్ సి) రాజీవ్ కనకాల డి) వెన్నెల కిశోర్
► నటుడు బ్రహ్మానందాన్ని అరగుండు బ్రహ్మానందం అని ఫిక్స్ చేసిన సినిమా ఏది?
ఎ) ఆహ నా పెళ్లంట బి) బాబాయ్ హోటల్ సి) విక్రమార్కుడుడి) బావగారు బాగున్నారా
► ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఇప్పటి ప్రముఖ హీరో ఎవరు?
ఎ) నాని బి) రవితేజ సి) శర్వానంద్ డి) రాజ్‌తరుణ్
► మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్’ అని డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) అల్లు అర్జున్ డి) రానా
► ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’దర్శకులు ఎవరు?
ఎ) సత్యజిత్ రే బి) దాదా సాహెబ్ ఫాల్కే సి) కమలాకర్ కామేశ్వర రావు డి) ఎల్వీ ప్రసాద్
► ‘నా పేరు మీనాకుమారి నా ఊరు కన్యాకుమారి..’ అని ‘మల్లన్న’ సినిమాలో ముమైత్ ఖాన్ డ్యాన్స్ చేసిన ఈ పాటను పాడిందెవరు?
ఎ) మాలతి బి) సుచిత్ర సి) కౌసల్య డి) సునీత
► ‘రోబో’ చిత్రంలో సాహసాలతో కూడిన ట్రైన్ ఫైయిట్‌ను కంపోజ్ చేసిన ఫైట్‌మాస్టర్ ఎవరు?
ఎ) రామ్–లక్ష్మణ్ బి) పీటర్ హెయి∙సి) అణల్ అరసు డి) విజయన్
► దర్శకుడు కాకముందు ఈయన ఆడియోగ్రాఫర్. ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యారు. చిన్న క్లూ: ఇటీవల ఈయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది
ఎ) కె. రాఘవేంద్ర రావు బి) ముత్యాల సుబ్బయ్య సి) కె. విశ్వనాథ్ డి) కోడి రామకృష్ణ
► ఈ ఫొటోలో చిరంజీవి ఎత్తుకున్న బుడతడు ఇప్పుడు హీరో.. చెప్పేస్తారా?
ఎ) రామ్‌చరణ్ బి) ఆది సి) సాయిధరమ్ తేజ్ డి) వరుణ్ తేజ్
► ఈ ఫొటోలో ఆడవేషంలోఉన్నది ఓ ప్రముఖ దర్శక–నిర్మాత. చిన్న క్లూ: అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన ఎక్కువ సినిమాలు తీశారు.
ఎ) వి.బి. రాజేంద్రప్రసాద్ బి) ఆదుర్తి సుబ్బారావు సి) కేయస్ ప్రకాశ్‌రావు డి) కేయస్‌ఆర్ దాస్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) బి 2) సి 3) ఎ 4) సి 5) ఎ6) బి 7) సి 8) బి 9) డి 10) సి11) బి 12) ఎ 13) బి 14) సి 15) బి16) బి 17) బి 18) సి 19) బి 20) ఎ