ప్రముఖ రచయిత బాలకుమరన్‌ మృతి | Tamil Writer Balakumaran Passes Away | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 2:19 PM | Last Updated on Tue, Jul 31 2018 5:33 PM

Tamil Writer Balakumaran Passes Away - Sakshi

తమిళ రచయిత బాలకుమరన్‌

ప్రఖ్యాత తమిళ రచయిత బాలకుమరన్ (71) చెన్నైలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 150 నవలలు, 100కు పైగా కథలు, 20 సినిమాలకు మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన బాలకుమరన్ తమిళ సినీ అభిమానులకు సుపరిచితులు. మణిరత్నం, శంకర్‌ లాంటి దర్శకులతో కలిసి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.

నాయకుడు, జెంటిల్‌మేన్‌, భాషా, సిటిజెన్‌ లాంటి సినిమాలకు బాలకుమరన్‌ పనిచేశారు. 1981లో భాగ్యరాజ హీరోగా తెరకెక్కిన ఇదు నమ్మ ఆలు సినిమాకు దర్శకత్వం వహించారు. పలు పత్రికలకు కల్కి, ఆనంద వికటన్‌, కుముదం లాంటి కథలను కూడా రాశారు. బాలకుమరన్‌ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement