మోహన్బాబుకు లండన్లో సత్కారం | Telugu Association of London to felicitate actor Mohan Babu | Sakshi
Sakshi News home page

మోహన్బాబుకు లండన్లో సత్కారం

Published Wed, Mar 25 2015 12:20 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

మోహన్బాబుకు లండన్లో సత్కారం

మోహన్బాబుకు లండన్లో సత్కారం

లండన్: ప్రముఖ నటుడు మోహన్బాబు లండన్లో సత్కారం పొందనున్నారు. తెలుగు చిత్రసీమకు 40 సంవత్సరాలుగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను వచ్చే శనివారం అవార్డుతో సత్కరించనున్నట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) ప్రకటించింది. 'చిత్ర సీమలోనే కాకుండా విద్యా పరంగా, స్వచ్ఛంధ సేవల పరంగా మోహన్బాబు అప్రతిహత సేవలు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా తమ సంస్థ తరుపున అవార్డును అందిస్తూ సత్కారం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది' అని టీఏఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసోజు రాములు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తాను పొందబోతున్న ఈ బహుమానాన్ని తన కుటుంబానికి, స్నేహితులకు అభిమానుల, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement