
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. తండ్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సామిత్రిగా నిత్యా మీనన్, కృష్ణకుమారిగా మాళవిక నాయర్, ప్రభగా శ్రియ,జయసుధ పాయల్ రాజ్‌పుత్, జయప్రధ హన్సికలు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ లిస్ట్‌లో మరో బ్యూటీ వచ్చి చేరింది. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కూడా యన్‌టిఆర్‌లో నటించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య, ఈషా కాంబినేషన్‌లో పలు సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే ఈషా ఎవరి పాత్రలో కనిపించనుందన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం యన్‌టిఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment