
సందీప్ కిషన్
‘సీమశాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం, ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాలతో నవ్వులు పంచిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మరోసారి ‘తెనాలి రామకృష్ణ బిఏబిఎల్’ సినిమాతో తనదైన శైలిలో వినోదం పంచనున్నారు. సందీప్ కిషన్, హన్సిక హీరో హీరోయిన్లు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం కర్నూలులో ప్రారంభమైంది. సందీప్ కిషన్, హన్సిక తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు, సహ నిర్మాతలు: రూప జగదీష్, వి. మహేశ్వరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: సాయి శ్రీరామ్.
Comments
Please login to add a commentAdd a comment