తరమణి కోసం ఆతృతగా.. | Thalaimani movie is a romantic film in his acting career | Sakshi
Sakshi News home page

తరమణి కోసం ఆతృతగా..

Published Sun, Aug 6 2017 2:38 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

తరమణి కోసం ఆతృతగా..

తరమణి కోసం ఆతృతగా..

తమిళసినిమా: నటుడికైనా, నటికైనా తమ నట జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే పాత్రలు అరుదుగా లభిస్తుంటాయి. అలా తరమణి చిత్రం తన నట జీవితంలో మరుపురాని చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని నటి ఆండ్రియా వ్యక్తం చేసింది. ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీలో మంచి నటేకాకుండా గాయని కూడా ఉందన్న విషయం తెలిసిందే.

చాలా సెలక్టివ్‌గా చిత్రాలను చేసే ఆండ్రియా నటించిన తాజా చిత్రం తరమణి. రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉందన్నది గమనార్హం. ఎట్టకేలకు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్రం చూసిన చిత్ర ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆండ్రియా నటించిన పాత్ర ఇంత వరకూ తమిళ సినిమాలో రాలేదంటున్నారు. ఇంతకు ముందు అవళ్‌ అప్పడిదాన్‌ చిత్రంలో నటి శ్రీప్రియ పాత్ర ఇప్పటికీ ఎలా గుర్తుండిపోయిందో, అలా తరమణి చిత్రంలోని ఆండ్రియా పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుందంటున్నారు.

ఇంతకీ ఈ సంచలన నటి ఈ చిత్రంలో పోషిస్తున్న పాత్ర ఏమిటో తెలుసా? వేశ్య పాత్ర అని సమాచారం. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ రహస్యంగా ఉంచారన్నది గమనార్హం. ఆండ్రియా తరమణి చిత్రం తరువాత మిష్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తుప్పరివాలన్‌ చిత్రంలో ప్రతినాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం తప్ప మరో చిత్రాన్ని ఆండ్రియా అంగీకరించలేదు. కారణం తరమణి చిత్రం విడుదల తరువాత ఇతర చిత్రాలను అంగీకరించాలని నిర్ణయించుకుందట. ఆ చిత్రం విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆండ్రియా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement