హైదరాబాద్ : దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై ఆయన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు అసభ్య పదజాలం వాడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తరుణ భాస్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఆయన వివరించారు.(చదవండి : నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు)
‘సాధారణంగా సినిమాలకు సంబంధించి చేసిన ఓ పోస్ట్.. సోషల్ మీడియాలో వేరే రకంగా ప్రొజెక్టు అయింది. గత కొద్ది రోజులుగా కొందరకు నన్ను, నా టీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో నేను సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరి వివరాలు వారికి అందజేశాను. ఇందుకు సంబంధించి తొలుత మేము వారిని పిలిచి చాలా మార్యాదగా మాట్లాడాం. ట్రోలింగ్ అనేది ఇతరుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించాం. అలాగే వ్యక్తిగత దూషణ అనేది తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించాం. కానీ వారు దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించాం. దీనిని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం.. మాపై తప్పుడు వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. కాగా, ఇటీవల మలయాళ చిత్రం కప్పేలా చూసిన తరుణ్ భాస్కర్.. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అలాగే తెలుగు సినిమాల్లో ఉండే అనవసరమైన కమర్షియల్ డ్రామా అందులో ఉండదని కూడా పేర్కొన్నారు. దీంతో ఓ హీరో అభిమానులు ఆయనకు వ్యతిరేంగా సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు.
To whomsoever it may concern...@hydcitypolice pic.twitter.com/MX5GXfMVX0
— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) July 1, 2020
Comments
Please login to add a commentAdd a comment