జోరు మీద బాయ్‌హుడ్ | The Grand Budapest Hotel, Boyhood: BAFTA winners 2015 | Sakshi
Sakshi News home page

జోరు మీద బాయ్‌హుడ్

Published Tue, Feb 10 2015 11:20 PM | Last Updated on Tue, Oct 2 2018 3:43 PM

జోరు మీద బాయ్‌హుడ్ - Sakshi

జోరు మీద బాయ్‌హుడ్

మరో రెండు వారాల్లో ఆస్కార్ విజేతల ఎవరో తెలుస్తారనగా ఈ లోపే బ్రిటీష్ అకాడమీ టెలివిజన్,ఫిలిం ఆర్ట్స్ (బాఫ్తా) అవార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఆస్కార్ బరిలో హాట్ ఫేవరెట్స్‌గా ఉన్న ‘బాయ్‌హుడ్’, ‘బర్డ్‌మేన్’ చిత్రాలు మరోసారి బాఫ్తా అవార్డుల్లో తలపడ్డాయి. అత్యంత కీలక విభాగాలైన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను ‘బాయ్‌హుడ్’ చిత్రం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి  చిత్రంపై పడింది.‘బర్డ్‌మేన్’ కేవలం ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును మాత్రమే దక్కించుకుంది.

ఆస్కార్ నామినేషన్స్‌లో హాట్ ఫేవరె ట్‌గా ఉన్న మరో చిత్రం‘ ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఇక ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లంచ్ బాక్స్’కు నిరాశే ఎదురైంది. పోలాండ్ చిత్రం ‘ఇదా’ ఈ విభాగంలో విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement