'జంగిల్ బుక్' దర్శకుడికి పెటా అవార్డు
ముంబై: జంగిల్‌బుక్ సినిమా దర్శకుడు జాన్ ఫావ్‌రీయ్‌ను ‘పెటా-యూఎస్’ అవార్డు వరించింది. ఈ సినిమాలో నిజమైన జంతువులకు బదులుగా కంప్యూటర్‌లో సృష్టించిన జంతు బొమ్మలను వినియోగించినందుకు ఆయనకు ఈ అవా ర్డు లభించింది. ప్రేక్షకులు ఇదివరకు చూడ ని విధంగా ఈ సినిమాలో బాలు (ఎలుగు), షేర్‌ఖాన్ (పులి) ఇతర పాత్రలను దర్శకుడు తెరకెక్కించాడు.
‘ఈ సినిమా చిత్రీకరణ ద్వారా చాలా కొత్త విషయాలు తెలిశాయి. జంతువుల ప్రవర్తన, వేట తదితర విషయాలు తెలుసుకునేందుకు రోజూ అడవికి వెళ్లేవాడిని’ అని జాన్ తెలి పారు. జంతువుల జీవన విధానాలను సరికొత్త కోణంలో ఆవిష్కరించినందుకు జాన్‌ను అభినందిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు’ అని భారత అసోసియేట్ డెరైక్టర్ సచిన్ బంగేరా కొనియాడారు.