బాహుబలి గ్రాఫిక్స్ టీంకు కొత్త పని..? | The secret behind Anushkas look in Baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి గ్రాఫిక్స్ టీంకు కొత్త పని..?

Published Wed, Feb 1 2017 12:13 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి గ్రాఫిక్స్ టీంకు కొత్త పని..? - Sakshi

బాహుబలి గ్రాఫిక్స్ టీంకు కొత్త పని..?

బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచిన విజువల్ వండర్. భారీ గ్రాఫిక్స్తో తెరకెక్కిన ఈ సినిమా, రీజినల్ సినిమా మార్కెట్ స్ధాయిని పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కుతుంది. తొలి సినిమాను మించే స్ధాయిలో మరింత భారీగా సీక్వల్ను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా గ్రాఫిక్స్ టీంకు యూనిట్ సభ్యులు కొత్త బాధ్యతలను అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. తొలి భాగం రిలీజ్ తరువాత 'సైజ్ జీరో' సినిమాలో నటించిన అనుష్క బాగా లావయ్యింది. ఆ తరువాత ఆమె తగ్గుతుందన్న ఆశతో చాలా రోజులు ఎదురుచూసిన రాజమౌళి, పెద్దగా తగ్గకపోవటంతో అలాగే షూటింగ్ కానిచ్చేశాడు. రెండో భాగంలో రాణిగా కనిపిస్తున్న అనుష్కను అందంగా స్లిమ్ లుక్లో చూపించే బాధ్యతను ఇప్పుడు గ్రాఫిక్స్ టీంకు అప్పగించాడన్న టాక్ వినిపిస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన పోస్టర్పై కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అనుష్క అంత స్లిమ్గా లేదంటున్న ప్రేక్షకులు గ్రాఫిక్స్ లోనే అనుష్కను అంత అందంగా చూపించారంటున్నారు. ఇది తొలి భాగం చిత్రీకరణ సమయంలో తీసిన ఫోటో అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా సైజ్ జీరో సినిమా కోసం అనుష్క చేసిన రిస్క్ రాజమౌళికి కొత్త తలనొప్పి తీసుకువచ్చిన మాట మాత్రం వాస్తవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement