దేశం వెనక్కి వెళుతోంది: నటి | There is too much intolerance: Gauahar Khan | Sakshi
Sakshi News home page

దేశం వెనక్కి వెళుతోంది: నటి

Published Thu, Apr 20 2017 8:16 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

దేశం వెనక్కి వెళుతోంది: నటి

దేశం వెనక్కి వెళుతోంది: నటి

కోల్‌కతా: దేశం వెనక్కు వెళుతోందని నటి, మోడల్‌ గౌహర్‌ ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నానాటికీ అసహనం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ‘ముందుకెళుతున్నాం అనే పేరిట భారతదేశం మరింత వెనక్కు వెళుతుండటాన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. దేశంలో విపరీతంగా అసహనం ఉంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తప్పకుండా శాంతంగా ఉండాలి’  అని ఆమె చెప్పారు.

మహిళలపై జరుగుతున్న నేరాలను నిలువరించేందుకు కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. ‘ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేయలేకుంటే మహిళలపై నేరాలు ఆగవు. 70 ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు మహిళలు మాట్లాడగలుగుతున్నారు. నేను నా గురించి మాట్లాడగలిగితే నాకు ఏం కావాలో అది ఎంపిక చేసుకుంటాను. ఈ విషయంలో కొంతమంది ఆలోచన విధానం మారితే బాగుంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement