
ఆమె గురించి నోరు విప్పిన టైగర్ ష్రాఫ్
టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు డేటింగ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లపై టైగర్ తొలిసారి పెదవి విప్పాడు. తన తదుపరి చిత్రం 'ఫ్లయింగ్ జాట్' ప్రమోషన్ కార్య క్రమంలో మీడియాతో మాట్లాడిన టైగర్.. దిశా గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీ ఇద్దరిపై వస్తున్న పుకార్లు విని చింతిస్తున్నారా అని ప్రశ్నించగా.. లేదు, నటుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధారణమే కదా.. పెద్దగా ఆలోచించడం లేదంటూ చెప్పాడు.
మరి దిశతో మీ రిలేషన్ మాటేంటి అని ప్రశ్నించగా.. 'అవును, మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను దాచాలనుకోవడం లేదు. ఆమెతో సమయం గడపడం నాకిష్టం. బయట తిరుగుతాను, కాఫీకి కూడా వెళ్తుంటాం. అయితే అంతకు మించి మాత్రం ఏమీ లేదు' అంటూ బదులిచ్చాడు ఈ యువ హీరో. ఇకనైనా ఈ రూమర్లకు తెరపడతాయో లేదో చూడాలి మరి. కాగా పూరీ సినిమా 'లోఫర్'తో తెలుగుతెరకు పరిచయమైన దిశా.. 'ఎమ్మెస్ ధోనీ' సినిమాలో ఓ కీలక పాత్ర ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతుంది.