తండ్రి మూవీ రీమేక్ లో యంగ్ హీరో కాదు! | Tiger Shroff not signed for old hit Khalnayak remake | Sakshi
Sakshi News home page

తండ్రి మూవీ రీమేక్ లో యంగ్ హీరో కాదు!

Published Thu, Jul 7 2016 4:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

తండ్రి మూవీ రీమేక్ లో యంగ్ హీరో కాదు! - Sakshi

తండ్రి మూవీ రీమేక్ లో యంగ్ హీరో కాదు!

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఓ మూవీలో నటించబోతున్నాడని, అందుకుగానూ అగ్రిమెంట్ పై సంతకం చేశాడంటూ వచ్చిన వార్తల్లో నిజంలేదని నిర్మాత సుభాష్ ఘాయ్ తెలిపాడు. 1993లో విడుదలై సక్సెస్ సాధించిన యాక్షన్ మూవీ 'ఖల్నాయక్' రీమేక్ లో టైగర్ నటిస్తున్నాడని ఇటీవల పలు కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని విషయాలను నిర్మాత మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు 2013లోనే సుభాష్ ప్రకటించాడు. ఇప్పటివరకూ ఏ హీరోను సంప్రదించలేదని మరిన్ని ఈ ప్రాజెక్టు వివరాలు కొన్ని వివరించాడు.

'అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. టైగర్ ష్రాఫ్ ఈ మూవీలో నటించడం లేదు. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రీమేక్ హక్కులను తీసుకున్నాడు. రణవీర్ సింగ్ తో మూవీ చేయాలని భన్సాలీ కోరుకుంటున్నాడు. మూవీ స్క్రిప్టు చివరి దశకు వచ్చిందని, ప్రేక్షకులు ఈ మూవీ రీమేక్ పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు' అని నిర్మాత చెప్పాడు. 1993లో వచ్చిన 'ఖల్నాయక్' లో సంజయ్ దత్ టెర్రరిస్టు బల్లు పాత్రలో కనిపించగా, అతడ్ని పట్టుకునేందుకు యత్నించే పోలీసు పాత్రలో జాకీ ష్రాఫ్, అతడి ప్రేయసిగా మాధురీ దీక్షిత్ నటించారు. తండ్రి మూవీ రీమేక్ అనగానే టైగర్ పై వదంతులు ప్రచారం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement