khalnayak
-
తండ్రి మూవీ రీమేక్ లో యంగ్ హీరో కాదు!
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఓ మూవీలో నటించబోతున్నాడని, అందుకుగానూ అగ్రిమెంట్ పై సంతకం చేశాడంటూ వచ్చిన వార్తల్లో నిజంలేదని నిర్మాత సుభాష్ ఘాయ్ తెలిపాడు. 1993లో విడుదలై సక్సెస్ సాధించిన యాక్షన్ మూవీ 'ఖల్నాయక్' రీమేక్ లో టైగర్ నటిస్తున్నాడని ఇటీవల పలు కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని విషయాలను నిర్మాత మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు 2013లోనే సుభాష్ ప్రకటించాడు. ఇప్పటివరకూ ఏ హీరోను సంప్రదించలేదని మరిన్ని ఈ ప్రాజెక్టు వివరాలు కొన్ని వివరించాడు. 'అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. టైగర్ ష్రాఫ్ ఈ మూవీలో నటించడం లేదు. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రీమేక్ హక్కులను తీసుకున్నాడు. రణవీర్ సింగ్ తో మూవీ చేయాలని భన్సాలీ కోరుకుంటున్నాడు. మూవీ స్క్రిప్టు చివరి దశకు వచ్చిందని, ప్రేక్షకులు ఈ మూవీ రీమేక్ పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు' అని నిర్మాత చెప్పాడు. 1993లో వచ్చిన 'ఖల్నాయక్' లో సంజయ్ దత్ టెర్రరిస్టు బల్లు పాత్రలో కనిపించగా, అతడ్ని పట్టుకునేందుకు యత్నించే పోలీసు పాత్రలో జాకీ ష్రాఫ్, అతడి ప్రేయసిగా మాధురీ దీక్షిత్ నటించారు. తండ్రి మూవీ రీమేక్ అనగానే టైగర్ పై వదంతులు ప్రచారం అవుతున్నాయి. -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్ దత్ కోసం మరో ఆసక్తికరమైన సీక్వెల్‌ను రెడీ చేస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. 1993లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'ఖల్నాయక్'కు సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు సుభాష్ ఘయ్. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ లీడ్‌రోల్స్‌లో నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సీక్వెల్ కు 'ఖల్నాయక్ రిటర్న్స్' అన్న టైటిల్‌ను కూడా ఫైనల్ చేశాడు సుభాష్ ఘయ్. అయితే ప్రస్తుతం ఎర్రావడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్, ఈ సీక్వెల్ కు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. తన మీద ఉన్న బ్యాడ్ బాయ్ ఇమేజ్ ను చెరిపేసుకోవాలనుకుంటున్న సంజయ్ మరోసారి ఇలాంటి పాత్రలో నటిస్తాడా లేక సుభాష్ ఘయ్ ఆఫర్ ను తిరస్కరిస్తాడా చూడాలి. తన కూతురు ఆపరేషన్ సందర్భంగా ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చిన సంజయ్‌దత్, విదు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీలను కలిశాడు. వీరి కాంబినేషన్లో మున్నాభాయ్ సీక్వెల్‌పై కూడా చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మరి సంజయ్, ఏ సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తాడో చూడాలి.