వర్షంలో శ్రద్ధగా... ఓ ఘాటు ముద్దు | Tiger Shroff-Shraddha Kapoor's Steamy Kiss In Baaghi! | Sakshi
Sakshi News home page

వర్షంలో శ్రద్ధగా... ఓ ఘాటు ముద్దు

Published Fri, Mar 11 2016 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

వర్షంలో శ్రద్ధగా... ఓ ఘాటు ముద్దు

వర్షంలో శ్రద్ధగా... ఓ ఘాటు ముద్దు

‘ఆషికి-2’ చిత్రంలో జోరు వానలో ఓ గొడుగు చాటున ఆదిత్యారాయ్ కపూర్‌తో శ్రద్ధాకపూర్ చేసిన లిప్‌లాక్ ఇప్పటికీ ఓ సంచలనమే. మళ్లీ అదే రేంజ్‌లో ‘భాగీ’ చిత్రం కోసం శ్రద్ధాకపూర్ చేసిన లిప్‌లాక్ ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తెల్లటి  చొక్కాలో వర్షంలో తడుస్తూ  ఆమె తన సహనటుడు టైగర్ ష్రాఫ్‌కు ఘాటైన ముద్దు లాగించేశారు. కచ్చితంగా ఈ దృశ్యం కుర్రకారు గుండెల్లో వేడి పెంచడం ఖాయం. సాబిర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవలే ఈ హాట్ లిప్‌కిస్ సీన్‌ను చిత్రీకరించారు. దర్శకుడు సాబిర్ ఖాన్ మాట్లాడుతూ- ‘‘టైగర్‌ష్రాఫ్, శ్రద్ధాకపూర్‌ల మధ్య  స్కూల్ రోజుల నుంచే మంచి స్నేహం ఉంది.

అందుకే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో వాళ్లిద్దరూ ఇబ్బందిపడలేదు. స్క్రిప్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకుని, ఈ సీన్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని గ్రహించే ఈ లిప్ లాక్‌కు ఒప్పుకున్నారు’’ అని  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement