
పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం 73వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు మాత్రం తమ పిల్లలను స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో రెడీ చేశారు. వారిని ఆ లుక్‌లో చూస్తూ మురిసిపోతున్నారు. చిన్నతనం నుంచే వారిలో దేశభక్తి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు అభయ్ రామ్ సుభాష్ చంద్రబోస్ వేషధారణలో సెల్యూట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. జై హింద్ అంటు పేర్కొన్నాడు. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు కూడా సాతంత్ర్య సమరయోధుల వేషధారణలో క్యూట్‌గా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. బన్నీ కుమారుడు అల్లు అయాన్ సైరా నరసింహారెడ్డి(ఉయ్యాలవాడ నరసింహారెడ్డి) లుక్‌లో, కుమార్తె అర్హ మణికర్ణిక(రాణి లక్ష్మీబాయి) లుక్‌లో చాలా ముద్దుగా ఉన్నారు.

Comments
Please login to add a commentAdd a comment