
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లో వంద కోట్లకు పైగా గ్రాస్‌సాధించటంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా మీడియాతో మాట్లాడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మహిళా రిజర్వేషన్లను మగాళ్లే ఆపుతున్నారు. తల్లి, భార్య, సోదరి కంటే ఎక్కువ ఎవరుంటారు. అందుకే నా చిత్రం ముగింపు మహిళలకు అధికారం ఇవ్వాలని చెప్పా. ఎన్టీఆర్ లాంటి బలమైన నటుడిని ప్రతి తరం చూడాలి. అరవింద సమేత భావోద్వేగాలతో కూడిన ప్రయాణం. ఒక పరాజయం, ఒక విషాధం తర్వాత వచ్చిన చిత్రం ఇది. ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ పేరును నిలబెట్టే వ్యక్తి కాదు... కొనసాగించే వ్యక్తి. తండ్రి మరణం విషాదాన్ని చూపించకుండా నలిగిపోయి పనిచేశారు. ఈ సినిమా విజయం ఎన్టీఆర్ దే’ అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ త్రివిక్రమ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. అరవింద సమేత పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ సినిమా అన్నారు. తామంత త్రివిక్రమ్ ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేశామన్న ఎన్టీఆర్, అరవింద సమేత లాంటి అద్భుత చిత్రాన్ని తనకు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క నటుణ్ని, సాంకేతిక నిపుణుడిని పేరు పేరునా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment