అవన్నీ రూమర్స్‌ : ఎన్టీఆర్‌ సినిమా కథపై త్రివిక్రమ్‌ | Trivikram Srinivas about Ntr Movie Story | Sakshi
Sakshi News home page

అవన్నీ రూమర్స్‌ : ఎన్టీఆర్‌ సినిమా కథపై త్రివిక్రమ్‌

Published Tue, Nov 7 2017 12:18 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Trivikram Srinivas about Ntr Movie Story - Sakshi

జై లవ కుశ సినిమాతో మరో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, తన నెక్ట్స్‌ సినిమాను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా కథపై కొద్ది రోజులు ఆసక్తిరమైన వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌ దర్శతక్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్‌ డిటెక్టివ్‌ తరహా పాత్రలో నటించనున్నాడని, ఈ కథను 80ల నాటి నవల ఆధారంగా త్రివిక్రమ్‌ సిద్ధం చేస్తున్నాడని, నవల హక్కులు కూడా తీసుకున్నారన్న టాక్‌ వినిపించింది.

త‍్రివిక్రమ్‌ గత చిత్రం ‘అ..ఆ..’ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా కావటంతో ఎన్టీఆర్‌ సినిమా విషయంలో వినిపిస్తున్న వార్తలు కూడా నిజమే అని భావించారు ఫ్యాన్స్‌. అయితే తాజాగా ఈ వార్తలపై త్రివిక్రమ్‌ స్పందించారన్న టాక్‌ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ సినిమా డిటెక్టివ్‌ కథ అన్న వార్తలు ఖండించిన త్రివిక్రమ్‌, ఈ సినిమా నువ్వు నాకు నచ్చావ్‌ తరహాలో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతుందని క్లారిటీ ఇచ్చారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నఈ సినిమాకు సంబందించిన పూర్తి వివారాలు పవన్‌ సినిమా పూర్తయిన తరువాత వెళ్లడయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement