పెళ్లైతేనే అసలు విషయం తెలుస్తుంది: రణబీర్ | Truth of 'affairs' will be out only when I get married: Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

పెళ్లైతేనే అసలు విషయం తెలుస్తుంది: రణబీర్

Published Thu, Sep 26 2013 7:49 PM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

పెళ్లైతేనే అసలు విషయం తెలుస్తుంది: రణబీర్

పెళ్లైతేనే అసలు విషయం తెలుస్తుంది: రణబీర్

బాలీవుడ్ తారలతో అఫైర్లు కొనసాగుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం తెలియాలంటే తన పెళ్లి జరుగాల్సిందే అని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ అన్నాడు. తన పెళ్లి జరుగుతేనే మీడియా తనపై రాస్తున్న వార్తలకు సమాధానం దొరుకుతుంది అని అన్నారు. దీపికా పదుకోనే తో ప్రేమ వ్యవహారం ముగిసిన తర్వాత ప్రస్తుతం కత్రినా కైఫ్ తో రిలేషన్ కొనసాగిస్తున్నాడంటూ ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉంది అన్నాడు.

అమితాబ్ నుంచి వరుణ్ ధావన్.. సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి అర్జున్ కపూర్ వరకు అందరూ తనకు పోటినే అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తన తండ్రి రిషీ కపూర్ నటించిన చిత్రాలను రీమేక్ చేయాలనే ఆలోచన తనకు లేదన్నాడు. ఒకవేళ నటించాల్సి వస్తే కర్జ్, జమానే కో దిఖానా హై అన్నాడు. అభినవ్ కాశ్యప్ దర్శకత్వంలో రణబీర్ నటిస్టున్న బేషరమ్ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement