Besharam
-
షారుక్ ఖాన్‌ను సజీవ దహనం చేస్తా: అయోధ్య సాధువు వార్నింగ్
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ప్రముఖ హీరోయిన్ దీపిక పదుకొణె జంటగా నటిస్తున్న పఠాన్ మూవీపై ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన బేషరమ్ పాట ఎంత వివాదాస్పదమైందో తెలిసిన విషయమే! బేషరమ్ పాటలో షారుక్, దీపికాలు ధరించిన దుస్తులపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై అయోధ్యలోని తపస్వి చాన్వీకి చెందిన మహంత్ పరమహంస తీవ్రంగా స్పందించారు. షారుక్ కనిపిస్తే ఉన్నచోటనే తగలబెడతానని మండిపడ్డారు. 'బేషరమ్ వివాదంపై సనాతన ధర్మాన్ని ఆచరించే అందరూ నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు షారుక్ పోస్టర్‌ను తగలబెట్టాం. ఒకవేళ ఆయన కానీ నాకు ఎదురుగా వస్తే సజీవ దహనం చేస్తా. పఠాన్ సినిమా రిలీజైతే ఏకంగా థియేటర్లనే దగ్ధం చేస్తాం' అని పరమహంస వార్నింగ్ ఇచ్చారు. ప్రేక్షకులందరూ పఠాన్ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని కోరారు. చదవండి: ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే.. నా భర్త నాకే సొంతమనడం తప్పా? హిట్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే? -
పెళ్లైతేనే అసలు విషయం తెలుస్తుంది: రణబీర్
బాలీవుడ్ తారలతో అఫైర్లు కొనసాగుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం తెలియాలంటే తన పెళ్లి జరుగాల్సిందే అని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ అన్నాడు. తన పెళ్లి జరుగుతేనే మీడియా తనపై రాస్తున్న వార్తలకు సమాధానం దొరుకుతుంది అని అన్నారు. దీపికా పదుకోనే తో ప్రేమ వ్యవహారం ముగిసిన తర్వాత ప్రస్తుతం కత్రినా కైఫ్ తో రిలేషన్ కొనసాగిస్తున్నాడంటూ ఇటీవల కాలంలో మీడియాలో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉంది అన్నాడు. అమితాబ్ నుంచి వరుణ్ ధావన్.. సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి అర్జున్ కపూర్ వరకు అందరూ తనకు పోటినే అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తన తండ్రి రిషీ కపూర్ నటించిన చిత్రాలను రీమేక్ చేయాలనే ఆలోచన తనకు లేదన్నాడు. ఒకవేళ నటించాల్సి వస్తే కర్జ్, జమానే కో దిఖానా హై అన్నాడు. అభినవ్ కాశ్యప్ దర్శకత్వంలో రణబీర్ నటిస్టున్న బేషరమ్ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. -
నేను ఎవరికీ భయపడను: రణబీర్ కపూర్!
'నేను ఎవ్వరికి భయపడను' అని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అన్నాడు. ఒకవేళ భయపడాల్సి వస్తే తన తండ్రికి తప్ప ఎవరికి భయపడను అని అన్నాడు. అంతేకాక ఎవరైనా టాప్ డైరెక్టర్లు తనతో పనిచేయమంటే భయం కలుగుతుంది అని అన్నాడు. భవిష్యత్ లో ఇంతియాజ్ ఆలీ, అనురాగ్ బసు లాంటి డైరెక్టర్లు పనిచేయనంటే భయం కలుగుతుంది అని అన్నాడు. ఇటీవల వార్తా ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎప్పడు విజయాన్ని తలకు ఎక్కించుకోను అని అన్నాడు. ఇప్పటికి తాను తన తండ్రి కళ్లలోకి చూసి మాట్లాడలేను అని.. తన తండ్రి అంటే భయంతోపాటు భక్తికూడా ఉందని.. బేషరమ్ చిత్రంలో తన తల్లితండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ లతో కలిసి నటిస్తున్నాడు. తన తండ్రితో కలిసి పనిచేయడం ఓ పక్క ఆనందంగా, భయంగాను ఉందన్నాడు. యే జవానీ హై దివానీ చిత్రంతో హిట్ సాధించిన రణబీర్ బేషరమ్ చిత్రంతో మరోసారి అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. -
'బేషరమ్' చిత్ర మీడియా సమావేశంలో రణబీర్, పల్లవి
-
'బేషరమ్', '24' ప్రమోషన్
'24' టీవీ షో ప్రమోషన్ కార్యక్రమంలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ హల్ చల్ చేశారు. బేషరమ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ సింగ్, హీరో రణబీర్ కపూర్ సందడి చేశాడు.