సునీల్ హీరోగా టూ కంట్రీస్ రీమేక్
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకుంనేందుకు కష్టపడుతున్న సునీల్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. కొత్త కథలతో ప్రయోగాలు చేసే కన్నా... ఆల్రెడీ సక్సెస్ సాధించిన కథలైతే సేఫ్ అని భావిస్తున్నాడు. అందుకే మలయాళంలో ఘనవిజయం సాధించిన టూ కంట్రీస్ తెలుగు రీమేక్లో నటించే ఆలోచనలో ఉన్నాడు సునీల్.
మలయాళంలో దిలీప్ నటించిన పాత్రకు సునీల్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట. చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించగా డైరెక్టర్ ఎన్ శంకర్ దక్కించుకున్నారు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ మహాలక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది.