ఉదయ నిధితో సై
నటి ఎమిజాక్సన్ యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ తో రొమాన్స్‌కు సై అన్నట్టు తాజా సమాచారం. ఈ లండన్ బ్యూటీకిప్పు డు కోలీవుడ్‌లో అవకాశాలు క్యూ కట్టడం విశేషం. మదరాసుపట్టణంతో తమిళ చిత్ర రం గంలో ప్రవేశించిన ఈ అమ్మడు ఆ తరువాత విక్రమ్‌తో తాండవం చిత్రంలో జోడీకట్టింది. మధ్యలో ఏక్ దివానా తా (నీదానే ఎన్ పొన్ వసంతం చిత్రానికి రీమేక్)తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ ఆ చిత్రం ఢమాల్ అవడంతో మళ్లీ కోలీవుడ్‌కు వచ్చింది. తమిళ పరిశ్రమ ఈ ముద్దుగుమ్మను అందలం ఎక్కించేస్తోంది. తాండవం తరువాత మరో సారి విక్రమ్‌తో ఐ చిత్రంలో నటించింది.
స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఎమి జాక్సన్ ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషపడిపోయింది. ఈ చిత్రం విడుదల కాకుండానే అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సూర్యకు జంటగా మాస్ చిత్రంలో నటిస్తున్న ఎమికి ఉదయనిధి స్టాలిన్ ఆఫర్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎమిజాక్సన్‌తో డ్యూయెట్లు పాడనున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రానికి కెత్తు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ ముద్దుగుమ్మ కూడా కొన్ని సెకండ్ గ్రేడ్ హీరోల చిత్రాలను కూడా కాదని ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్ చేయడానికి సై అందట. ఇందుకు మరో కారణం కూడా ఉందట. ఈ పరదేశీ బ్యూటీ అడిగిన పారితోషికం చెల్లించడానికి ఉదయనిధి స్టాలిన్ వెంటనే ఓకే అనడంతో ఎమిజాక్సన్ ఆయనతో నటించడానికి ఎస్ అన్నారని కోలీవుడ్ టాక్.