సౌండ్‌ పొల్యూషన్‌... | Undha Ledha Theatrical Trailer Launch | Sakshi
Sakshi News home page

సౌండ్‌ పొల్యూషన్‌...

Published Fri, Nov 17 2017 12:39 AM | Last Updated on Fri, Nov 17 2017 12:39 AM

 Undha Ledha Theatrical Trailer Launch - Sakshi

రామకృష్ణ, అంకిత జంటగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఉందా..లేదా..?’. అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్‌.కమల్‌ నిర్మించి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ని నిర్మాత మాల్కాపురం శివకుమార్‌ విడుదల చేశారు. ‘‘సౌండ్‌ పొల్యూషన్‌ వల్ల ప్రజలకు జరిగే అనర్థాలు, సమస్యల్ని చూపించబోతున్నాం’’ అన్నారు వెంకట శివప్రసాద్‌. ‘‘ఇప్పటి  వరకూ రాని కొత్త కథతో తీసిన చిత్రమిది’’ అన్నారు ఎస్‌.కమల్‌. నటులు జీవా, దర్శకుడు శివప్రసాద్, రామ్‌ జగన్, అంకిత పాల్గొన్నారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు: అల్లం సుబ్రమణ్యం, అల్లం నాగిశెట్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement