చరణ్ సినిమాలో మరో యువ హీరో | Vaibhav in Ram Charan Sukumar Movie | Sakshi
Sakshi News home page

చరణ్ సినిమాలో మరో యువ హీరో

Published Wed, Mar 1 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

చరణ్ సినిమాలో మరో యువ హీరో

చరణ్ సినిమాలో మరో యువ హీరో

ధృవ సినిమాతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ చిత్రంలో చరణ్ న్యూ లుక్లో దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడట. త్వరలోనే షూటింగ్ ప్రారంభ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

రామ్ చరణ్, సమంతలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మరో యువ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో గొడవ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైభవ్ తరువాత కోలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ యంగ్ హీరో రామ్ చరణ్ సినిమాలోనూ కీ రోల్లో నటించనున్నాడు. మెగా కుటుంబంతో సన్నిహిత సంబందాలున్న సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడే వైభవ్. అందుకే రామ్ చరణ్ సినిమాలో క్యారెక్టర్ అనగానే కథ కూడా అడగకుండానే ఓకే చేశాడట ఈ యంగ్ హీరో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement