ముసుగు తీసేద్దాం | Varalakshmi Sarathkumar gets a new mask tattoo on her hand | Sakshi
Sakshi News home page

ముసుగు తీసేద్దాం

Published Sun, Mar 31 2019 5:51 AM | Last Updated on Sun, Mar 31 2019 5:51 AM

Varalakshmi Sarathkumar gets a new mask tattoo on her hand - Sakshi

‘‘మనందరం ముసుగులమే. ఇతరుల కోసం అబద్ధాలు ఆడుతూ, వాళ్లను ఇంప్రెస్‌ చేసే ప్రయత్నంలో మనం మనలా కాకుండా మరోలా ఉండే ముసుగు వేసుకుని బతుకుతున్నాం. ఆ ముసుగులు లేకుండా మనకు నచ్చినట్టుగా జీవించగలగాలి’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. వరలక్ష్మీకి ట్యాటూలంటే చాలా ఇష్టం. ఆల్రెడీ 7,8 ట్యాటూలను వేయించుకున్నారు కూడా. ప్రతి ట్యాటూకి ఓ స్టోరీ ఉంటుంది. లేటెస్ట్‌గా మరో రెండు ట్యాటూలకు తన శరీరం మీద చోటిచ్చారు. కొత్తగా వేయించుకున్న  ఈ ట్యాటుల వెనక అర్థాన్ని వివరిస్తూ – ‘‘సినిమా మీద నాకున్న ఇష్టం, సినిమాల్లో ఉన్న ధీర మహిళలకు సపోర్ట్‌గా ఈ ట్యాటూలను వేయించుకున్నాను. మనం వేసుకున్న ముసుగులను ఉద్దేశిస్తూ మాస్క్‌ ట్యాటులు వేసుకున్నాను. ముసుగు వేసుకొని బతుకుతున్న మనందందరం ఏదో రోజు ఆ ముసుగుని తీసేద్దాం. మనల్ని మనమే ఇష్టపడటం నేర్చుకుందాం’’ అన్నారు వరలక్ష్మి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement