![varalakshmi sarathkumar on social media post her feelings - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/27/Varalaxmi-Sarathkumar-6.jpg.webp?itok=dsOdhiJZ)
వరలక్ష్మీ శరత్‌కుమార్
హీరోయిన్.. లేడీ విలన్...క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా కథ రీత్యా ఎలాంటి పాత్రలోనైనా ప్రేక్షకులకు నచ్చే విధంగా నటిగా ఒదిగిపోగలరు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇప్పటికి పాతిక సినిమాలను పూర్తి చేశారామె. ఈ సందర్భంగా ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి, తన భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్నారు వరలక్ష్మి. ఆ పోస్ట్ సారాంశం ఇలా... ‘‘మన జీవితంలో మంచి విషయాలు అంత సులభంగా జరగవు. కానీ మన కలలు నిజం కావాలి. అందుకే నేను శక్తి వంచన లేకుండా కష్ట పడుతుంటాను. ఇప్పుడు నా జీవితంలో నేను ఈ స్థాయిలో నిలబడటానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. 25 సినిమాలు పూర్తి చేసి నా కెరీర్‌లో ఓ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా నన్ను సరిగా అర్థం చేసుకోలేని, నా పట్ల వ్యతిరేక భావనలను కలిగి ఉన్నవారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే... వీరి వల్లే నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శక–నిర్మాతలు, సహాయం చేస్తున్న నా స్టాఫ్ మెంబర్స్‌కు, అండగా ఉంటున్న నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు నమ్మి పని చేయండి. కలలు కంటూనే ఉండండి’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. తమిళంలో ఫుల్ బిజీగా ఉంటూ డబ్బింగ్ చిత్రాల్లో ప్రేక్షకులకు కనిపించే వరలక్ష్మి సందీప్‌కిషన్ ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో తెలుగులో తొలి స్ట్రయిట్ సినిమా చేశారు. ఇప్పడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment