వరలక్ష్మీ శరత్‌కుమార్
‘ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడండి?’ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న ఇది. ‘ఇంకా ఆలోచించలేదు. నచ్చినవాడు దొరికినప్పుడు’ అంటూ సమాధానాలు ఇస్తుంటారు హీరోయిన్లు. వరలక్ష్మీ మాత్రం ‘అసలు పెళ్లి చేసుకునేది లేదు’ అంటున్నారు. అనుకున్నది, అనిపించినది ముక్కుసూటిగా చెప్పేయడం నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు అలవాటు.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కన్ని రాశి’ అనే తమిళ సినిమాలో నటించారామె. ఈ సినిమా ప్రేమ, పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో మీరు ఎవర్ని పెళ్లాడతారు? అని ప్రశ్నించగా – ‘‘కన్ని రాశి’ స్క్రిప్ట్ చదవగానే నాకు నచ్చింది. ఇందులో లవ్ మ్యారేజ్ ప్రాముఖ్యతను ప్రస్తావించాం. కానీ నా జీవితంలో నేను ఎవ్వర్ని పెళ్లి చేసుకోను. పెళ్లి అనే సంప్రదాయాన్ని నేను పెద్దగా నమ్మను’’ అని అన్నారు. గతంలో విశాల్, వరలక్ష్మి రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment