ఇడియట్, పోకిరి, చిరుతల్లా... | Varun Tej's Loafer | Sakshi
Sakshi News home page

ఇడియట్, పోకిరి, చిరుతల్లా...

Nov 8 2015 11:41 PM | Updated on Mar 22 2019 1:53 PM

ఇడియట్, పోకిరి, చిరుతల్లా... - Sakshi

ఇడియట్, పోకిరి, చిరుతల్లా...

పూరి జగన్నాథ్ మార్క్ హీరోలంటే కొంచెం రెక్లెస్‌గా, కొంచెం డైనమిక్‌గా తెరపై చాలా పవర్ ప్యాక్‌డ్‌గా కనిపిస్తారు.

పూరి జగన్నాథ్ మార్క్ హీరోలంటే కొంచెం రెక్లెస్‌గా, కొంచెం డైనమిక్‌గా తెరపై చాలా పవర్ ప్యాక్‌డ్‌గా కనిపిస్తారు. ‘కంచె’లో ధూపాటి హరిబాబుగా క్లాస్ లుక్‌లో అలరించిన వరుణ్ తేజ్ ఇప్పుడు ‘లోఫర్’గా పూరి జగన్నాథ్ స్టయిల్‌లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపించనున్నారు. ఈ లోఫర్ కథ ఏంటి? అతని లవ్‌స్టోరీ ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సి.వి.రావు, శ్వేతాలానా, వరుణ్, తేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిశా పటాని కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘రవితేజకు ‘ఇడియట్’, మహేశ్‌బాబుకు ‘పోకిరి’, చరణ్‌కి ‘చిరుత’, బన్నీకి ‘దేశముదురు’ సినిమాల తరహాలో వరుణ్ తేజ్ కెరీర్‌లో మంచి మాస్ సినిమాగా నిలిచిపోతుంది.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement