వీరభద్రం దర్శకత్వం లోరవితేజ? | Veerabhadram-raviteja combination? | Sakshi
Sakshi News home page

వీరభద్రం దర్శకత్వం లోరవితేజ?

Published Mon, Sep 16 2013 12:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

వీరభద్రం  దర్శకత్వం లోరవితేజ?

వీరభద్రం దర్శకత్వం లోరవితేజ?

‘బలుపు’తో బాక్సాఫీస్ వద్ద తన తడాఖా చూపించిన రవితేజ... ఆ చిత్ర కథా రచయిత బాబీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. 
 
 ఆ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా రవితేజ పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి అహ నా పెళ్లంట, పూలరంగడు చిత్రాల దర్శకుడు  వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. 
 
 ప్రస్తుతం నాగార్జున ‘భాయ్’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్న వీరభద్రం... మరో వైపు రవితేజ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసుకుంటున్నట్లు వినికిడి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement